శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కాంగ్రెస్‌లోనే ప్రాణత్యాగాలు చేసిన మహనీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, నవంబర్ 19: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులు కాంగ్రెస్‌లోనే ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రజాసేవలోనే ప్రాణాలను త్యజించారన్నారు. సోనియాగాంధీకి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించారన్నారు. అలాంటి పార్టీలో కార్యకర్తలుగా ఉన్నందుకు ప్రతిఒక్కరు గర్వించాలన్నారు. మిగతా పార్టీలకు ఇంతటి ఘనమైన చరిత్ర లేదన్నారు. సోమవారం ఇందిరాగాంధీ 101వ జయంతి సందర్భంగా ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ ప్రముఖులు ఆర్టీసీ బస్టాండ్ వద్దగల ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పలువురు కాంగ్రెస్ ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా ఇందిరాగాంధీ 101వ జయంతి సందర్భంగా 101 కేజీల కేక్‌ను కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 101 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ హరిత విప్లవం, క్షీర విప్లవంతో పాటు అత్యంత అధునిక సాంకేతికత తెచ్చిన మహానేత ఇందిరమ్మ అన్నారు. అమెరికా కూడా వణికేలా మంచి సైన్యాన్ని బలిష్టం చేశారన్నారు. 70 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన మహనీయురాలు ఇందిరమ్మ అన్నారు. ఇప్పటి ప్రభుత్వాలు కనీసం 70 ఎకరాల స్థలమైనా పేదలకు ఇవ్వలేదన్నారు. పేదలు నేడు మూడుపూటల తింటున్నారంటే అదే కేవలం ఇందిరమ్మ చలవేనని అన్నారు. అందుకే ఇందిరమ్మ రాజ్యం తిరిగి రావాలని ప్రతిఒక్కరు ప్రతిజ్ఞ చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు వైఎస్‌ఆర్ హయాంలో శంకుస్థాపన చేసి ఇందిరాసాగర్ పోలవరం అని పేరు పెడితే ఈ ప్రభుత్వం మార్చేసిందన్నారు. ఎవరికి మేలు చేయడానికి ఈ కుట్రలు పన్నుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉండేవని అన్నారు. బీజేపీ పాలనలో నాలుగేళ్లలో విపరీతంగా ధరలు పెంచి పేద ప్రజల రక్తాన్ని పీల్చుకుతింటున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నెల పేదలకు 9 నిత్యావసర సరుకులు, నెలకు నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ సాధారణ మహిళ కాదని, సాక్షాత్తు దుర్గాదేవి స్వరూపం అన్నారు. ప్రపంచ స్థాయిలో మన దేశానికి గుర్తింపు ఉందంటే ఇందిరమ్మ పుణ్యమేనని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బీజేపీ నాయకుడు కాదని, కాంగ్రెస్‌కు చెందినవారేనని అన్నారు. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వేరువేరు కాదని వాళ్లిద్దరు ఒక పార్టీ నాయకులేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు బీజం వేసింది ఇందిరమ్మ అని దానిని తాను సిఎంగా ఉన్నప్పుడు సబ్‌ప్లాన్‌కు చట్టం తెచ్చామన్నారు. జగన్ పాదయాత్ర వల్ల లాభం లేదని, రాష్ట్రంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్లడం లేదన్నారు. అందుకే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం దేశ రాజకీయాలను ప్రభావితం చేసి స్ఫూర్తిదాయక నేతగా నిలిచిన వ్యక్తి ఇందిరమ్మ అన్నారు. విద్యార్థి దశ నుంచి ఇందిరమ్మ బాటలో ప్రజాసేవలో ఉన్నామన్నారు. ఇందిరమ్మ చేసిన సేవలు వివరించాలంటే రోజులు చాలవన్నారు. ప్రత్యేక హోదా రావాలంటే రాహుల్‌ను ప్రధానమంత్రి చేయాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పార్లమెంటులో పోరాటం చేస్తున్నామని చెప్పారు. మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ కార్యకర్తలపై తమకు విశ్వాసం ఉందని, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని కాంగ్రెస్‌ని అందరికీ చేరువ చేస్తున్న కార్యకర్తలకు కృతజ్ఞలు తెలిపారు. పార్టీలు మారడం తప్పుకాదని కానీ పాత పార్టీని తిట్టవద్దని హితవు పలికారు. సిఎం చంద్రబాబు మొదులుకుని దేశంలోని ప్రధాన నేతలందరు కాంగ్రెస్‌లో ఎదిగినవారేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ తల్లిలాంటిందన్నారు. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. నల్లధనం తెస్తామని చెప్పిన మోదీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పేదలకు మేలు చేకూరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఏఐసిసి సెక్రటరీ క్రిస్ట్ఫర్ మాట్లాడుతూ నాయకుల లక్షణాలు ఎలా ఉండాలో ప్రపంచానికి ఇందిరమ్మ చెప్పారన్నారు. ఇందిరమ్మ మృతితో కలత చెందినవారిలో తాను ఒకడినని అన్నారు. వాజ్‌పేయి అంతటి నేత ఇందిరమ్మ ధీరత్వాన్ని మెచ్చుకున్నారని తెలిపారు. ఇందిరమ్మ బ్యాంకులను జాతీరుూకరణ చేసి లక్షల మందికి ఉద్యోగాలను కల్పించారన్నారు. 20 సూత్రాలతోనే దళితులు ఇందిరమ్మ గృహాలను పొందారని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని దుర్భాషలాడవద్దని హితవు పలికారు. సొంత ఆస్తులను పేదలకు ధారపోసిన కుటుంబం ఇందిరమ్మ కుటుంబం అన్నారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న మోదీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. మాజీ మంత్రి శైలజానాధ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ అంటే అందరికీ అమ్మని, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యనే నినాదంతో అధికారాన్ని సాధిస్తామన్నారు. ఏఐసిసి మెంబర్ మయప్పన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగాన్ని ప్రజలకు చేరువ చేసిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అన్నారు. దేశంలో నిరంకువ పాలన నశించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చేవూరు దేవకుమార్‌రెడ్డి, ఉడతా వెంకట్రావు, చెంచలబాబు యాదవ్, సివి శేషారెడ్డి, రఘురామ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

నిషేధిత క్యాట్ ఫిష్ పట్టివేత
కోవూరు, నవంబర్ 19: నిషేధిత క్యాట్‌ఫిష్‌ను తరలిస్తున్న లారీని నెల్లూరు విజిలెన్స్ ఎస్పీ శ్రీకంఠనాథరెడ్డి ఆధ్వర్యంలో విజిలెన్స్, ఫిషరీస్ అధికారులు సోమవారం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో పట్టుకున్నారు. క్యాట్‌ఫిష్‌ను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న విజిలెన్స్ డిఎస్పీ కెసి వెంకటయ్య, ఫిషరీస్ అధికారి కాలేషా, సిఐలు సుధాకర్‌రెడ్డి, వెంకటనారాయణ ఇతర సిబ్బందితో కూడిన బృందం ఏపి 27 టివై 9273 నెంబరు లారీని ఆపి తనిఖీ చేయగా అందులో 4 టన్నుల క్యాట్‌ఫిష్‌ను చెన్నైకు తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈక్రమంలో నిందితుడు షేక్ గయాజ్‌ను అరెస్ట్ చేసి కోవూరు పోలీసులకు అప్పగించారు.