శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఉత్సాహంగా ఫ్లెమింగో క్రీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 21: పక్షుల పండుగ సందర్భంగా సోమవారం జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహించారు. కబడ్డీ, వాలీబాల్ తదితర వాటిని అధికారులు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పేర్లు నమోదు చేసుకొన్న జట్ల క్రీడాకారులు క్రీడల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన ఈ క్రీడల్లో అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన జట్లకు పక్షుల పండుగ ముగింపు సభలో మంత్రుల చేతులమీదుగా బహుమతుల ప్రదానం చేయనున్నారు.
ఆకర్షణగా ఒంగోలు జాతి పశువులు
పక్షుల పండుగలో ప్రత్యేక ఆకర్షణగా ఒంగోలు జాతికి చెందిన పశువులు ప్రత్యేకంగా నిలిచాయి. వీటితోపాటు మేలుజాతి ఆవులు, వివిధ రకాల పక్షులు కూడా సందర్శకులను ఆకొట్టుకొనేలా ఉన్నాయి. అదేవిధంగా వన్యప్రాణి విభాగం వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో పులికాట్‌లో పక్షులు కిలకిలరావాలు చేస్తున్నట్లు, నేలపట్టు చెరువులో ఉన్న మడచెట్లపై పెలికాన్, గూడబాతులు, పక్షులు పొదుగుతున్నట్లు నమూనాలు ఎంతగానో ఆకట్టుకొన్నాయి.

పాల డెయిరీలపై విజిలెన్స్ దాడులు
* శాంపిల్స్ సేకరించిన అధికారులు
మనుబోలు, జనవరి 21 : స్థానికంగా ఉన్న రెండు పాల శీతలీకరణ కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఏన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ శ్రీకంఠనాథరెడ్డి ఆదేశాల మేరకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి ఉన్న పాల డెయిరీలలో దాడులు నిర్వహించి పాల శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు. ఈ శాంపిల్స్ హైదరాబాద్‌కు పంపించి నివేదిక వచ్చిన తర్వాత లోపాలు ఉంటే చర్యలు చేపడతామన్నారు. ఆహార పదార్ధాలు, పాల ఉత్పత్తిలో కల్తీ చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దీంతోపాటు పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచి అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవన్నారు. పాలల్లో కల్తీ జరుగుతుందన్న అనుమానంతో అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడులను కాగితాలపూరు క్రాస్‌రోడ్డు సమీపంలోని తిరుమల వాసా పాల శీతలీకరణ కేంద్రం, స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న వినాయక పాలడెయిరీలపై దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. ఈ దాడుల్లో ఆయనతోపాటు విజిలెన్స్ డీఎస్పీ కేసీ వెంకటయ్య, సిఐ ఆంజనేయరెడ్డి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రరావు తదితరులు ఉన్నారు.