శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఇంధన ధరల పెరుగుదలతోనే ఆర్టీసీకి నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 19: ఆర్టీసీలో కార్మికులు బాగా పనిచేస్తున్నప్పటికీ రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతోనే నష్టాల్లో కూరుకుపోయిందని ఆ సంస్థ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబు అన్నారు. మంగళవారం ఆయన ఆర్టీసీ అధికారులతో కలసి సూళ్లూరుపేట డిపోను సందర్శించారు. డిపోలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి కార్మికులను సమస్యలడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆయన డిపో మేనేజర్ ఛాంబర్ వద్ద కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేసే కార్మికులందరికీ పూర్తిస్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించినట్లు తెలిపారు. అధికారులు, కార్మికులు సమష్టిగా పనిచేసి సంస్థను లాభాలో బాటలో నడపాలన్నారు. రాష్ట్రంలో అన్ని డిపోల్లో కార్మికులందరూ బాగానే పనిచేస్తున్నారని రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతోనే ఆర్టీసీ నష్టాలను అధిగమించలేక పోతోందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓఆర్ శాతం, కిలోమీటర్లు కూడా పెరిగి కాస్త నష్టాలను పూడ్చగలిగామన్నారు. అదేవిధంగా ప్రస్తుతం కార్మికులకు సిసిఎస్ కింద ప్రమాద బాధితులకే కాకుండా సాధారణ మరణానికి కూడా రూ.5లక్షలు బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అదే విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికులకు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా వైద్య ఖర్చులను సంస్థ భరించే విధంగా చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిపోలో ఉన్న ఎంప్లాయూస్, సీఐటియూ, ఎన్‌ఎంయూ యూనియన్ల నాయకులు డిపోలో ఎక్కువగా ఆర్డినరి బస్సులు ఉన్నాయని ఈ ప్రాంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని అనేక మంది నెల్లూరు, చెన్నై నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వెళుతుంటారని సుదూర ప్రాంతాలకు వెళ్లే హైటెక్, సూపర్ లగ్జరీ కొత్త బస్సులు కేటాయించి, ఎక్స్‌ప్రెస్ బస్సుల సంఖ్య పెంచాలని ఎండీని కోరారు. వెంటనే ఆయన స్పందించి పరిశీలించి అవసరమైన కొత్త సర్వీసులు ఇస్తామన్నారు. కార్మికులకు కూడా డిపోలో అన్ని వసతులు కల్పించే విధంగా చొరవ తీసుకుంటామన్నారు. ముందుగా ఎండీకి డిపో సెక్యూరిటి పాయింట్ వద్ద డిపో మేనేజర్ వికె స్వామి, యూనియన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేటకు వచ్చిన ఆయన డిపో ఆవరణలో గుర్తుగా మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఈడీ వెంకటేశ్వరావు, సీటీఎం కృష్ణారావు, ఎస్టీఐ కల్పనరెడ్డి, ఎస్సై పి విశ్వనాధరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

చెంగాళమ్మకు 108 కలశాలతో క్షీరాభిషేకం
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 19: తెలుగు, తమిళుల ఆరాధ్య దైవమైన సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా మంగళవారం 108 కలశాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. ముందుగా అష్టోత్తర కలశాలకు అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి వేదపండితులు, మంత్రోచ్ఛరణల నడుమ కలశాలను పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాల మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటుచేసి మహా చండీయాగాన్ని ఘనంగా నిర్వహించారు. చెరుకుపల్లి రామ్‌కుమార్‌రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. క్షీరాభిషేకం, చండీయాగం ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ పాలకమండలి సభ్యులు చిట్టేటి పెరుమాల్, వేనాటి గోపాల్‌రెడ్డి, మాదరకపాక జగన్మోహన్, ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.