శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 19: దేశ ప్రథమ పౌరుడు రామనాథ్ కోవింద్ ఈనెల 22న జిల్లా పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ అతిథిగృహంలో మంగళవారం ఆయన ఇంటెలిజెన్స్ డిఐజి పివిఎస్ రామకృష్ణ, ఎస్‌పి ఐశ్వర్య రస్తోగి, ఇంటర్ సెక్యూరిటీ వింగ్ ఎస్‌పి టి రాంప్రసాద్, ఇతర ప్రభుత్వ, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు, రాకపోకలు, బందోబస్తు, ప్రొటోకాల్ ఏర్పాట్లపై నిశితంగా చర్చించారు. అధికారులందరూ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. రాష్ట్రపతి తో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా వస్తారన్నారు. రాష్టప్రతి పాల్గొనే అన్ని కార్యక్రమాల సమయాలను గమనంలో ఉంచుకోవాలన్నారు. అనంతరం వారందరూ పోలీస్ కవాతు మైదానంలోని రెండు హెలిపాడ్‌లతో పాటు నిర్మాణంలో ఉన్న మరో హెలిపాడ్‌ను పరిశీలించారు. హెలిపాడ్‌ల వద్ద బారికేడింగ్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఐజి ఎస్‌పిని ఆదేశించారు. తరువాత వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్‌లోని ఉప రాష్ట్రపతి నివాసానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి వాహనశ్రేణి రాకపోకలు, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం వారు వెంకటాచలం మండలం కేంద్రంలోని కనుపూరు బిట్-2, ఆర్‌విఎన్‌ఎల్ రైల్వే వంతెన, అక్షర విద్యాలయం చేరుకున్నారు. అక్కడ సాంకేతిక శిక్షణ సంస్థ, పర్ణశాల, ఓపెన్ ఆడిటోరియం, హెలిపాడ్‌లను పరిశీలించారు. అలాగే స్వర్ణ్భారత్ ట్రస్ట్ స్వామి వివేకానంద విగ్రహాన్ని, వార్షికోత్సవ వేదిక, సీటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. సాంస్కృతిక ప్రదర్శనల వివరాలు ముందుగా తెలియజేయాలన్నారు. వీరి వెంట కేంద్ర ప్రభుత్వ ఎస్‌బి డిసిపి భార్గవ్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ గోవింద్, అగ్నిమాపక అధికారి ధర్మారావు, ఇంటెలిజెన్స్ డిఎస్‌పి చెంచుబాబు, సర్వజన వైద్యశాల ఇన్‌ఛార్జ్ పర్యవేక్షకుడు డాక్టర్ హరనాథ్, ఆర్‌డిఒ చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.