శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నెల్లూరు అభివృద్ధిని కాంక్షించే తొలి వ్యక్తిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 20: తాను పెరిగిన, తిరిగిన, ఎదిగిన నెల్లూరు అభివృద్ధిని కాంక్షించే వారిలో తొలి వ్యక్తిని తానని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నెల్లూరులో బుధవారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అభివృద్ధి పనుల ప్రారంభానికి నెల్లూరు రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. నెల్లూరులో తాను తిరగని వీధి లేదంటే అతిశయోక్తి లేదన్నారు. తన కుమార్తె దీపావెంకట్ నెల్లూరు నెక్ట్స్ పేరుతో రూపకల్పన చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం నెల్లూరులో పలు అభివృద్ధి పనులు రూపుదిద్దుకుంటున్నాయని కొనియాడారు. ఎందరో నేతలు నెల్లూరు నుండి దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన స్థాయికి చేరినా నెల్లూరు అభివృద్ధి విషయంలో మాత్రం ఎంతో కొంత కొరత ఉంటూనే ఉందని చెప్పారు. రూ.1100 కోట్ల హడ్కో రుణంతో నెల్లూరులో భూగర్భ డ్రైనేజీ, సమగ్ర మంచినీటి వ్యవస్థలు ఏర్పాటు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కూడా తన చేతులమీదుగా ప్రారంభించాలనే కోరిక ఉందన్నారు. నెల్లూరు జిల్లాకు 20,681 ఇళ్లను కేటాయించడం జరిగిందన్నారు. వైజాగ్-చెన్నై పారిశ్రామిక నడవా పనులు కూడా ఈనెలాఖరుకు ప్రారంభమయ్యే అవకాశముందన్నారు. తాను ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా నెల్లూరు మట్టిని, పెన్నా నీటిని, అవి తనకందించిన ఆప్యాయతను మరువలేనని స్పష్టం చేశారు. రూ.30కోట్ల అమృత నిధులతో నిర్మితమువుతున్న నెక్లెస్ రోడ్డుతో నెల్లూరు రూపురేఖలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎక్కడ ఉన్నా నెల్లూరు అభివృద్ధి అవసరాల కోసం సదా సిద్ధంగా ఉంటానని హామీనిచ్చారు. అభివృద్ధి విషయంలో అందరూ రాజకీయాలకు అతీతంగా సహకరించుకోవాలని కోరారు. తాను మూడు రోజులపాటు జిల్లాలో ఉంటానని, తొలి రోజు అభివృద్ధి పండగ, రెండో రోజు రైల్వే పండగ, మూడు రోజు స్వర్ణ్భారత్ వార్షికోత్సవ పండగ జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. నెక్లెస్‌రోడ్డు సమీపంలో ఉన్న ఆక్రమణలను తొలగించి వారికి ప్రత్యామ్నాయం చూపించాలని సూచించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని గతంలో నెల్లూరు మెడికల్ కళాశాల ప్రారంభ వేదికపై అడిగిన వెంటనే అక్కడికక్కడే వెంకయ్యనాయుడు ఆమోదించారని గుర్తు చేశారు. మార్చి 31వ తేదీ నాటికి పనులు పూర్తవుతాయని, ఈలోగా నగరవాసులు రోడ్లను తవ్వి ఉన్నందున కాస్త అసౌకర్యానికి గురవుతున్నారని, అర్థం చేసుకొని సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నగరంలో 80 పార్కులను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా 20 పార్కులను పూర్తిచేసి ఇప్పటికే ప్రారంభించామని, బుధవారం ఉపరాష్టప్రతి చేతుల మీదుగా మరో 20 పార్కులను ప్రారంభించినట్లు వెల్లడించారు. నగర వాసులు మరో 2 నెలలు ఓపిక పడితే నగరంలో ప్రాథమిక వసతులు పూర్తిచేసి, సామాజిక వసతుల కల్పనకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నగరంలో 430 కిమీ మేర అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, 710 కిమీ మేర సమగ్ర మంచినీటి వ్యవస్థ పనులు జరుగుతున్నాయని తెలిపారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో రెండుచోట్ల రైల్వే ఫ్లైఓవర్ వంతెనలు ఏర్పాటు చేయించాలని ఉపరాష్ట్రపతిని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
అంతక్రితం పలు అభివృద్ధి పనులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన నెక్లెస్ రోడ్డు, అభివృద్ధి చేసిన 20 పార్కులు, 330 అదనపు తరగతి గదులు తదితర అభివృద్ధి పనుల శిలాఫలకాలను నెక్లెస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప రాష్టప్రతి ఆవిష్కరించారు. అంతక్రితం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరుకు చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు జిల్లా కలెకర్టర్ రేవు ముత్యాలరాజు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ, జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి తదితరులు వేదాయపాలెం రైల్వేస్టేషన్‌లో స్వాగతం పలికారు.