శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అక్రమంగా నిల్వ చేసిన ఇసుక సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, మే 17: అక్రమంగా నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఇసుక అక్రమ నిల్వలపై స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు దాడి చేసిన సీజ్ చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కాకుటూరు సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న పరిశ్రమల కేంద్రం వద్ద ఇసుకను అక్రమ రవాణా చేయడానికి సుమారు 200 యూనిట్లకు పైగా నిల్వ ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉచితంగా అందిస్తూ, ఇతర రాష్ట్రాలకు తరలింపుపై నిషేధం విధించింది. దీంతో బయట రాష్ట్రాలలో ఇసుకకు మంచి డిమాండ్ వుంది. రాష్ట్రాల సరిహద్దులు దాటకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమై విస్తృతంగా తనిఖీ చేస్తుండడంతో ఇసుక మాఫియా నూతన పంథాను ఎంచుకుంది. గతంలో రీచ్‌ల నుండే నేరుగా ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. ప్రస్తుతం తనిఖీలు విస్తృత్తంగా ఉండడంతో పరిశ్రమల కేంద్రాన్ని అక్రమాలకు అడ్డాగా చేసుకుంది. పరిశ్రమ నిర్మాణం కోసం నిలువ ఉంచినట్లుగా ట్రాక్టర్లు, టిప్పర్లలో రీచ్‌ల నుండి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఈ తంతు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు ఎస్‌ఐ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించడంతో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. దీంతో భారీస్థాయిలో ఇసుక నిలువ చూసి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. ఈ తంతు ఎప్పటి నుండి సాగుతున్నది, ఇసుకను ఏఏ రాష్ట్రాలకు తరలిస్తున్నారు? అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అక్రమ రవాణా వెనుక పెద్దల హస్తం వుంటుందని స్ధానికులు చెపుతున్నారు. మొత్తంమీద ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.