శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మాతృభాష కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 17: తమిళనాడులో మాతృభాష మనుగడ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని భవాని రెసిడెన్సీ హోటల్‌లో మంగళవారం 25 కళాసంఘాల ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లావాసిగా తమిళనాడులో తెలుగు భాష కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందన్నారు. తమిళనాడులో తెలుగువారికి ఏ కష్టమొచ్చినా తాము అనేక పర్యాయాలు పోరాటాలు చేసిన సంగతి గుర్తుచేశారు. కృష్ణదేవరాయలను అవమానించేలా నిర్మించిన సినిమాను నిలుపుదల చేయాలంటూ తాము సినీనటుడు వడివేలు ఇంటి ఎదుట ధర్నా చేశామన్నారు. జయలలిత తెలుగు భాషను పాఠ్యాంశాల్లోంచి తొలగించడం ద్వారా తెలుగువారికి చేసిన ద్రోహానికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం ఎదుర్కోనుందని జోస్యం పలికారు. జయలలిత ఓటమి-తెలుగువాడి గెలుపు నినాదంతో తాను ఆమెపై పోటీ చేసినట్లు తెలిపారు. జయాపజయాల కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయలేదనీ, కేవలం తెలుగువారి సత్తా జయలలితకు తెలియచెప్పడమే తన ఉద్దేశ్యమని అన్నారు. తమిళనాడులో కేవలం 2 శాతం ఉన్న రాజస్థానీయుల సమస్యలను పిలిపించుకొని విన్న జయలలిత 32 శాతం ఉన్న తెలుగువారి గురించి పట్టించుకున్న పాపానపోలేదని వాపోయారు. తమిళనాడులోని తెలుగువారి ఉచితాల కంటే తమ మాతృభాషకే ప్రాధాన్యతనిచ్చి ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారన్నారు. 25 కళా సంఘాల గౌరవాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమిళనాడులోని తెలుగువారి కోసం నిత్యం పోరాడుతున్న యోధుడిగా కేతిరెడ్డిని అభివర్ణించారు. తెలుగు భాషలో బోధనను నిషేధించడం ద్వారా జయలలిత తన ఓటమిని కొనితెచ్చుకోనున్నట్లు వ్యాఖ్యానించారు. ఇకనైనా తమిళనాడులో తెలుగు విద్యను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతక్రితం కేతిరెడ్డిని శాలువా, పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డేగా రామచంద్రారెడ్డి, హరి పాల్గొన్నారు.