శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాపూరు, మే 17: మండల పరిధిలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆచారం ప్రకారం గోనుపల్లి గ్రామంలోని పెంచలస్వామి ఆలయం నుంచి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి దేవేరులతో సహా లక్ష్మీనరసింహస్వామి విశేష అలంకరణతో మంగళవాయిద్యాలు, నాట్యబృందాలు, భజన వేదమంత్రాల నడుమ ఊరేగింపుగా పెంచలకోనకు బయలుదేరారు. ఈ గ్రామోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని ఆలయ ప్రధాన అర్చకులు పెంచలస్వామి ప్రకటించారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలోని గిరిజన కాలనీలో స్వామివారు ఆశీనులు కావడంతో ఈ ప్రాంత గిరిజనులు తమ అల్లుడైన స్వామివారికి పుట్టతేనె, సారెపప్పు, ఆరిమొలతాడు, గడ్డలు కట్నంగా అందజేశారు. అనంతరం కాయకర్పూరాలు అందించి పలువురు భక్తులు స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారికి గ్రామ సమీపంలోని గొల్లబోయిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోయలు స్వామివారిని పల్లకీలో పెంచలకోనకు తరలించడంతో పెంచలకోన బ్రహ్మోత్సవాల మొదటి ఘట్టానికి నాంది పలికినట్లయింది.
వైభవంగా ప్రారంభమైన అంకురార్పరణ
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి ఏడు గంటలకు స్వామివారి అంకురార్పణ భక్తుల నడుమ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. స్వామివారి అంకురార్పణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు భారీగా విచ్చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ తానంకి నానాజీ, ఆలయ సహాయ కమిషనర్ శనగవరం శ్రీరామమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పీర్ల సోమయ్య యాదవ్‌లతోపాటు మరికొంతమంది సభ్యులు ఈ అంకుర్పారణ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. వెంకటగిరి సిఐ శ్రీనివాసరావు, రాపూరు సబ్ ఇన్‌స్పెక్టర్లు కరీముల్లా, రామకృష్ణ శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
పెంచలకోనలో నేడు
పెంచలకోన బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజైన బుధవారం పలు ఉత్సవ కార్యక్రమాలతోపాటు సంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం ఐదు గంటలకు శ్రీవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఆరు గంటలకు శ్రీవార్లకు పూలంగి సేవ, ఆంజనేయ స్వామికి పూలంగి సేవ, 7.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం, ఉదయం 10.21 నిమిషాలకు ధ్వజారోహణ కార్యక్రమం, 11.30 నిమిషాలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపాలకరణతోపాటు రాత్రి 10 గంటలకు శేషవాహన సేవ ఉత్సవాలు జరగనున్నాయి.