శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మీ-సేవ కేంద్రాల పనితీరు మెరుగుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 17: జిల్లాలోని మీ-సేవా కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకొని ఆ కేంద్రాల నిర్వహణ మరింత సమర్ధవంతంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారుల్ని రాష్ట్ర భూసేకరణ, పరిపాలన కమిషనర్ అనీల్ చంద్ర ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించిన సేవలు మాత్రమే మీసేవ కేంద్రాల ద్వారా జరుగుతున్నాయనీ, మరిన్ని సేవలు వీటిద్వారా ప్రజలకు అందించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జన్మభూమికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్ డే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా గ్రీవెన్స్‌డే నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు జిల్లా కార్యాలయాలకు వచ్చే పని ఉండదన్నారు. జిల్లాకు వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసే నిధులు నిబంధనల మేరకు ఖర్చు చేయాలని సూచించారు. విఆర్‌ఓ నుండి తహశీల్దార్ వరకూ వారి సీనియారిటీ జాబితా ఆయా జిల్లా వెబ్‌సైట్‌లో పెట్టడంతో పాటు ప్రతిని పంపించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన రుణ అర్హత కార్డుల గురించి, పరిశ్రమల స్థాపనకు భూకేటాయింపుల గురించి అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఇంతియాజ్, డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.