శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పులికాట్‌కు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 17: ఇటీవలి వరకు నీరు లేక ఎడారిని తలపించిన పులికాట్ సరస్సు నేడు జలకళ సంతరించుకుంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన వానతో సరస్సుకు వర్షపు నీరు చేరింది. చాలాకాలం తరువాత వేసవిలో వర్షం కురవడంతో జాలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూళ్లూరుపేట నుండి శ్రీహరికోటకు వెళ్లే మార్గంతో పాటు కొరిడి-పేర్నాడు, వేనాడు వెళ్లే మార్గాన ప్రళయకావేరికి వర్షపు నీరు చేరగా అలలతో సరస్సులో నీళ్లు ఎగసిపడుతున్నాయి. సరస్సులో వేట లేక దూరప్రాంతాలకు చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. సరస్సుకు నీరు చేరడంతో ఇకపై చేపలు, రొయ్యలు, పీతలు విరివిగా దొరికే అవకాశం ఉండడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.