శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మోదీ నాయకత్వంతో భారత్ ప్రతిష్ట విశ్వ వ్యాప్తమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, జూన్ 16: దేశానికి అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించటంలో మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని పురమందిరం (టౌన్‌హాలు)లో గురువారం మోదీ సర్కార్ రెండేళ్ల పాలనపై (వికాస్‌పర్వ్) మేథావులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి, కుంభకోణాలతో గత 60 ఏళ్లలో కాంగ్రెస్, యుపిఎ ప్రభుత్వాలు దేశాన్ని అధోగతిపాలు చేయగా కేవలం రెండేళ్ల వ్యవధిలో భారత కీర్తి ప్రతిష్టలు విదేశాలకు సైతం గుర్తించే స్థాయికి ప్రధానమంత్రి మోదీ తీసుకెళ్లారని కితాబిచ్చారు. రెండేళ్ల పాలనలో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఎవరైనా ఏమిచ్చారని ప్రశ్నిస్తే వారికి ప్రభుత్వం తరపున కుంభకోణాలు, అవినీతి లేని పరిపాలనతో పాటు ప్రజలు నేరుగా ప్రధానితో సంభాషించే వీలు కల్పించామని సగర్వంగా చెప్పదలచామన్నారు. మోదీకి అమెరికా వచ్చే వీలు కల్పించాలా? వద్దా అనే స్థితి నుండి ఆ దేశం సైతం స్వాగతం చెప్పే స్థాయికి మోదీ ఎదిగారని, ఇపుడు ఆయన ఏ దేశం వెళ్లినా అపూర్వ స్వాగతంతో పాటు ఆయన ఆటోగ్రాఫ్ కోసం వరుస కడుతున్నారన్నారు. మోదీ నాయకత్వంతో విదేశాల్లో సైతం మా గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయని ఎన్‌ఆర్‌ఐలు చెప్పటం మా ప్రభుత్వ విజయమన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపచేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ఆర్థిక వృద్ధిరేటును సాధించిందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక విదేశీ పెట్టుబడులు సాధించిన దేశంగా భారత్ నిలిచిందన్నారు. దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తెలియజేసేందుకు దేశంలోని 200 నగరాల్లో ఏర్పాటు చేసిన ఈ వికాస్ పర్వ్ ఆషామాషీగా వచ్చి చేసే కార్యక్రమం కాదని, ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించటం జరుగుతుందన్నారు. సంస్కృతి సంప్రదాయాల్లో తొలుత విశ్వ గురువుగా ఉన్న భారత్ కీర్తి ప్రతిష్టలను గత పాలకులు మసకబారేటట్లు చేశారని, పునఃప్రతిష్ఠ కోసం మోదీ కృషి చేస్తున్నారన్నారు. మన దేశంలో ప్రత్యేకించి దక్షిణ భారత్‌లో వ్యక్తిగత సామర్ధ్యాలు, నైపుణ్యాలకు కొదువలేదన్నారు. మోదీ రాకతో ప్రజల ఆలోచనలు మారుతున్నాయని, దీంతో దేశం మార్పు కోరుకుంటోందన్నారు. బొగ్గు, స్పెక్ట్రం వేలం, మైనింగ్ రాయల్టీ ద్వారా లక్షల కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. దేశంలో మూడు విద్యుత్ పైలట్ ప్రాజెక్ట్‌ల్లో ఎపి ఒకటని, దీంతో నాణ్యమైన నిరంతర విద్యుత్ అందిస్తున్నామన్నారు. బిజెపి సీనియర్ నాయకులు సీతారామిరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జల వనరుల సహాయమంత్రి సవర్‌లాల్ జాట్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దినేష్‌శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, డాక్టర్ శ్రీనివాసతేజ, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, పి సురేంద్రరెడ్డి, మండవ ఈశ్వరయ్య, మేథావులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.