శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సమన్వయంతో మొక్కలు నాటాలి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 4: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొక్కలు నాటడానికి సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జానకి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వన మహోత్సవంపై కలెక్టర్ జానకి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను, విద్యార్థులను, భాగస్వాములుగా చేసి విజయవంతం చేయాలన్నారు. ఈనెలలో కనీసం 10 లక్షల మొక్కలు నాటాలని అధికారులను ఆమె ఆదేశించారు. పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. రెండు రోజుల్లోగా మొక్కల లభ్యత వివరాలను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డివిజనల్ అటవీ శాఖాధికారి బిఎం చాణక్యరాజు, టెర్రిటోరియల్ అటవీ శాఖ అధికారి పిఎస్ రాఘవయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.