శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైతుల పేరుతో కిసాన్ సెజ్ భూ దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 4: రైతుల పేరుతో రాచర్లపాడు కిసాన్ సెజ్ నిర్వాహకులు భూ దందాకు పాల్పడుతున్నారని జిల్లా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇఫ్‌కో కర్మాగారానికి 1900 ఎకరాలను కేటాయించిందని, అయితే కర్మాగారం ఏర్పాటు జరగకపోవడంతో ఆ భూమిని కిసాన్ సెజ్‌కు ఇచ్చిందన్నారు. కాగా సెజ్ స్వాధీనంలో ప్రస్తుతం 2954 ఎకరాల భూమి ఉందని, సుమారు 1054 ఎకరాల ప్రభుత్వ భూమిని వారు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల కోసం భూములు కేటాయిస్తామని చెప్పి ప్రస్తుతం మల్టీ నేషనల్ కంపెనీలకు భూములను కోట్లకు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కోకోకోలా కంపెనీకి ఎకరా రూ.69 లక్షల వంతున 150 ఎకరాల భూమిని అమ్మేశారన్నారు. ఈ భూమి కన్వర్షన్ జరగలేదనీ, పంచాయతీ పన్నులు చెల్లించలేదని, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు కూడా లేవని స్పష్టం చేశారు. అదే విధంగా 150 ఏళ్ల చరిత్ర కలిగిన రాచర్లపాడు చెరువును సెజ్ యాజమాన్యం కబ్జా చేసిందని, దీనికింద ఉన్న 160 ఎకరాల ఆయకట్టు రైతులు పొలాలను బీడులుగా మార్చేసిందని దుయ్యబట్టారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఓజిలి గోవిందరెడ్డి మాట్లాడుతూ కిసాన్ సెజ్ పేరుతో జరుగుతున్న భూదందా, సాగునీటి అక్రమ కేటాయింపులపై జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నట్లు తెలిపారు. కోకోకోలా కంపెనీకి ఏడాదికి సుమారు 6 టిఎంసీల నీటిని వాడుకునేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో జిల్లా రైతాంగం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని, న్యాయస్థానాల గడప కూడా తొక్కి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు బెజవాడ గోవిందరెడ్డి పాల్గొన్నారు.