శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల అదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 4: అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖలో విస్తృతంగా వినియోగిస్తున్నందు వల్ల నేరాలను గణనీయమైన స్థాయిలో అదుపులో ఉంచగలుగుతున్నామని రాష్ట్ర డిజిపి జెవి రాముడు పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోఏర్పాటైన వివిధ పోలీస్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం కానిస్టేబుళ్ల ఎంపికలో పలు మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కానిస్టేబుళ్ల వయోపరిమితిలో సడలింపు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికలో తొలుత రాత పరీక్ష నిర్వహించి, అనంతరం దేహ దారుఢ్య పరీక్షలు జరిపే ఆలోచనతో ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచినట్లు వెల్లడించారు. అదేవిధంగా 5 కిమీ పరుగుపందెం కూడా తొలగించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదనలు ఉన్నందున పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకటన ఆలస్యమవుతోందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల నేరాలు అదుపులో ఉన్నాయనేందుకు తిరుపతి నగరాన్ని ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమేరాల వల్ల దాదాపు 60 శాతం పలు నేరాలు తగ్గుముఖం పట్టినట్లు ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సిసిటిఎన్‌ఎస్ ప్రాజెక్టు అమలులో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశంలో పోలీస్‌శాఖలో ప్రవేశపెట్టిన 10 అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞాన పూరితమైన ప్రాజెక్టుల్లో మూడు ప్రాజెక్టులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి పునర్విభజన తర్వాత దాదాపు 3వేల మంది పోలీస్ అధికారులు రావాల్సి ఉందని, వీరి బదిలీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని వెల్లడించారు. జిల్లాలోని కృష్ణపట్నం పోలీస్‌స్టేషన్ పోర్టు పరిధి లోపల ఉన్నందున స్టేషన్ పరిధిలోని స్థానికులు స్టేషన్‌లో ఫిర్యాదుకు వెళ్లాలంటే పోర్టు అధికారులు అనుమతించడం లేదంటూ ఆయన దృష్టికి తీసుకురాగా, త్వరలోనే పోర్టు స్టేషన్‌ను మెరైన్‌కు పరిమితం చేసి శాంతిభద్రతల కోసం ప్రత్యేక స్టేషన్‌ను ఏర్పాటుచేసే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజి సంజయ్, జిల్లా ఎస్పీ విశాల్ గున్ని, అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.