శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

గిరిజనులను ఏకం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, జూలై 4: గిరిజనులను ఏకం చేసి వారి హక్కుల కోసం, భారత దాస్య శృంఖలాలను చేధించటం కోసం అహర్నిశం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజని ఎజెసి సాల్మన్ రాజ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ భవన్‌లో సోమవారం సీతారామరాజు 120వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన, ఆదివాసీల హక్కుల సాథన కోసం ఆంగ్లేయులతో అలుపెరుగని పోరాటం సల్ఫిన ఉద్మకారుడుని శ్లాఘించారు. ఆంగ్లేయుల ప్రభుత్వం గిరిజనులు, ఆదివాసీల శ్రమను దోచుకుని సాంప్రదాయంగా వస్తున్న అటవీ ఉత్పత్తుల మీద జీవించే వారిని ఏజేన్సీ ప్రాంతాలలో అనేక ఇబ్బందులకు గురి చేసేవారన్నారు. ఆయన పోరాట పటిమ ద్వారా వారిని ఏకం చేసి దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమాలతో భారతీయ హక్కులను సాధించేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయని మహనీయుడన్నారు. కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ కమలకుమారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఆర్ ఎం శేషగిరిరావు, సెట్‌నెల్ సిఇఒ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపాల్ మహేశ్వర రావు, ఎన్‌జిఒ ప్రతినిథి బషీర్, ఎస్‌సి, ఎస్‌టి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎన్ రాజశేఖర్, దళిత నాయకులు గోవర్థన్, పార్వతయ్య, గిరిజన నాయకులు దశయ్య, ఎపిఒ గంగాధర్, ఎటిడబ్ల్యుఒ జ్యోత్స్న, ఆశ్రమ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వల్లన చేసి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పది, ఇంటర్‌లలో అధిక శాతం మార్కులు పొందిన విద్యార్థులకు మెమెంటోలు అందించారు.