శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొరవారిసత్రం, జూలై 17: 16వ నెంబర్ జాతీయ రహదారిపై కలగుంట బ్రిడ్జి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డాక్టర్ మువ్వా భవాని (48), ధరణీ నరేష్ (30) మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన డాక్టర్ దువ్వా ఆదిశేషరావు తెనాలికి చెందిన భవానిని వివాహం చేసుకుని తమిళనాడులోని పొనే్నరిలో నివాసం ఉంటూ అక్కడే ఆసుపత్రి ఏర్పాటు చేసుకుని 20 ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 14న ఆదిశేషారావు తండ్రి సాంవత్సరీక కార్యక్రమాలలో పాల్గొనేందుకు తన భార్య, డ్రైవర్ ధరణి నరేష్, ఆసుపత్రిలో పనిచేసే నర్సు తమ్ముడు కుమార్ కారులో ఏలూరుకు వెళ్లారు. శనివారం రాత్రి తిరిగి ఏలూరు నుండి పొనే్నరికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఈ సమయంలో దొరవారిసత్రం మండలం కలగుంట బ్రిడ్జి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా అదుపు తప్పి ఆగివున్న లారీని ఢీకొని వెనుక ఇరుక్కుపోయింది. ప్రమాద విషయం గమనించని లారీ డ్రైవర్ సుమారు 50 అడుగుల వరకు కారును లాక్కొని వెళ్లాడు. అనంతరం లారీని రోడ్డు పక్కన నిలిపి చూడగా డ్రైవర్ ధరణి నరేష్, వెనుక సీటులో ఉన్న మువ్వా భవాని సంఘటన స్థలంలో మృతి చెందారు. ఆదిశేషారావు, కుమార్‌కు గాయాలు కావడంతో స్థానిక పోలీసులు వారిరి సురక్షితంగా బయటకు తీసి 108 సాయంతో నాయుడుపేటకు తరలించారు. అనంతరం వీరిని మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు. ఎస్సై మారుతీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.