శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తడ కిరాణాషాపుల్లో నీలి కిరోసిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జూలై 17: పారిశ్రామికంగా తడ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ అక్రమ వ్యాపారాలు అదేరీతిలో అభివృద్ధి చెందుతున్నాయి. కిరాణా షాపుల్లో పప్పు దినుసులతో పాటు రాయితీపై ప్రభుత్వం పేద ప్రజలకు అందించే నీలి కిరోసిన్‌ను విక్రయిస్తున్నారు. ఈ నీలి కిరోసిన్ రేషన్ దుకాణాలో లీటర్‌ను 9 రూపాయలకు విక్రయిస్తుండగా బహిరంగ మార్కెట్‌లో లీటరు 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. సివిల్ సప్లయ్ అధికారులు దీనిపై దృష్టిపెట్టే స్థితిలో లేరు. ఇదే క్రమంలో రాయితీపై వినియోగదారులకు అందించే వంట గ్యాస్‌ను కూడా కిలో 150 వంతున బహిరంగంగా విక్రయిస్తున్నారు. 3,5 కిలోల సిలెండర్లలో గ్యాస్‌ను కిలో 150 రూపాయల వంతున నింపి విక్రయిస్తున్నారు. అలాగే తమిళనాడులో లభ్యమయ్యే కిలో రూపాయి సబ్సిడీ బియ్యాన్ని తడ కిరాణా షాపుల్లో కిలో 13 రూపాయల వంతున విక్రయిస్తున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.