శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, జూలై 17: నగరంలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, అపార్ట్‌మెంట్‌ల ఆక్రమణ తొలగింపు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఆదివారం రామ్‌నగర్ ప్రాంతంలోని కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఒక ఎఇ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో దానిని టాస్క్ఫోర్స్ బృందాలు పోలీసు పహారా మధ్య తొలగించారు. రెండవ రోజున మూడు బృందాలు విడివిడిగా వెళ్ళి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను తొలగించారు. ఇదిలా వుంటే పొగతోటలోని ఒక డాక్టర్ భవనానికి జి ఫ్లస్ 2 అనుమతి తీసుకుని ఆరు అంతస్తులు నిర్మించి ఉంటే దాని జోలికి వెళ్లకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే టాస్క్ఫోర్స్ జాబితాలో పొగతోటలో నిర్మించిన ఈ భవనం జాబితాలో ఉందో లేదో తెలియడంలేదు. ఆక్రమణల తొలగింపును ఆపేందుకు మేయర్ అబ్దుల్ అజీజ్ తన బృందంతో సిఎంను కలిశారు. అయితే ఏమైందో తెలియదు కాదని ఆక్రమణ తొలగింపు మాత్రం కొనసాగుతూనే ఉంది. దీంతో మేయర్, అక్రమ నిర్మాణలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
సిటీ ప్లానింగ్ అధికారులపై భవన యజమాని దాడి
నగరంలోని శెట్టిగుంట రోడ్డులో గల వెంగయ్య అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలను నిర్మించడంతో ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన సిటీ ప్లానింగ్ అధికారులను ఆదివారం స్థానికులు అడ్డుకుని రాళ్లతో దాడి చేశారు. దానికితోడు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి కూడా వారికి సహకరించడంతో అధికారులకు తీవ్రస్థాయిలో దెబ్బలు తాగిలాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత కావడంతో పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. స్థానికంగా ఉన్న మహిళలను ఇంటి యజమాని పోగు చేసి వారి చేత అధికారులపై దాడి చేయించారు. ఈనేపధ్యంలో పోలీసులు కూడా మహిళలు కావడంతో ఏమీచేయలేక చేతులు ఎత్తేశారు.