శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎంఎల్‌సి సోమిరెడ్డి స్పష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, జూలై 17: ప్రభుత్వానికి వ్యాపారులు అండగా ఉండాలని శాసనమండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరు నగరంలోని ఎస్‌బిఎస్ కల్యాణ మండపంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తుల న్యాయమైన కోర్కెలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కాస్తామని చెప్పారు. ఈమధ్యకాలంలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ సమస్యలను కూడా సిఎం దృషికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా చూశామన్నారు. వ్యాపారస్తులు గత పరిస్థితులను మరచి పారదర్శకంగా ఉండే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా జీఓలలో ఉన్న లొసుగుల పేరుతో అధికారుల వేధింపులు లేకుండా జీఓలను సవరించేందుకు సిఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అవినీతికి తావులేకుండా ఆన్‌లైన్ సిస్టం ద్వారా సరళీకృతం చేయడం వల్ల పరిపాలన పారదర్శకంగా ఉంటుందన్నారు. జీఓలలో లొసుగుల ఆధారంగా వ్యాపారస్తులను అధికారులు ఇబ్బంది పెడితే వెంటనే తన దృషికి తీసుకురావాలన్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యాపారస్తులు బాగా అభివృద్ధి చెందాలన్నారు. వే బిల్లు, మిస్ మ్యాచ్ పేరుతో వేధింపులకు గురిచేయకుండా అధికారులకు తగిన సూచనలు ఇస్తామన్నారు. ఒకరు, ఇద్దరు వల్ల వ్యాపారస్తులను దొంగలుగా చిత్రీకరించడం లేదన్నారు. శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ వ్యాపారస్తులు ప్రజలు, ప్రభుత్వానికి వారిధిగా ఉండాలన్నారు. ప్రభుత్వపరంగా వ్యాపారస్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. వ్యాపారులను దొంగలుగా చిత్రీకరించి చూడకూడదన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆన్‌లైన్ ద్వారా పన్నులు కట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దళారీ వ్యవస్థ రూపుమాపడానికి ఆన్‌లైన్ విధానం ద్వారా పన్ను కట్టించుకోవడం జరుగుతుందన్నారు. మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్టన్రికి రైతన్నలు అన్నదాతలు మాదిరిగా వ్యాపారస్తులు కూడా రాష్ట్రానికి వెన్నుముక లాంటివారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్ ఉన్న నాయకుడు అన్నారు. వ్యాపారవేత్త కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి అన్నారు. వ్యాపారస్తులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఎపిఎఫ్‌సిసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి మాట్లాడుతూ వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాప్రతినిధుల ముందు వినిపించారు. ప్రభుత్వానికి వ్యాపారస్తులు సహకరించడం వల్ల పన్నును అధికారులు సూచించిన విధంగా చెల్లిస్తున్నామని చెప్పారు. అయితే జీఓలో ఉన్న లొసుగులను చూపించి వ్యాపారస్తులను భయభ్రాంతులు చేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలాంటి జీఓలను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపార వర్గాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రాష్ట్రం విడిపోక ముందు రాష్ట్రానికి 40వేల రూపాయలు పన్ను రూపంలో వస్తే విడిపోయిన తరువాత ఒక్క ఎపి నుండి 39వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వ్యాపారస్తులు చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆనం జయకుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మంచికలపాటి శ్రీనివాసులు, దాసా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.