శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వెంకటేశ్వరపురంలో పది సవర్ల బంగారం చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, జూలై 17: స్థానిక వెంకటేశ్వరపురంలో శనివారం అర్ధరాత్రి ఇంటిలో అందరూ ఉండగానే దుండగులు చోరీ చేసి సుమారు పది సవర్ల బంగారు నగలను అపహరించుకుపోయారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు శ్రీనివాసులురెడ్డి ఎఫ్‌సిఐ గోడౌన్‌లో ఉద్యోగం చేస్తుంటారు. శనివారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్నారు. ఇంటికి సంబంధించిన తాళాలు తన దిండు కింద పెట్టుకొని నిద్రకు ఉపక్రమించారు. ఆ సమయంలో కొంతమంది దుండగులు ఆయన దిండు కింద ఉన్న తాళాలు తీసుకొని ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న బంగారు నగలను అపహరించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అదే బీరువాలో కొంత నగదు, వెండి వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని తాకకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. తెలిసినవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సిఐ దుర్గాప్రసాద్ చెప్పారు.