శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రత్యేక హోదాతోనే నవ్యాంధ్ర ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయగిరి, ఆగస్టు 5: ప్రత్యేక హోదా సంతరించుకుంటేనే రాష్ట్రం ప్రగతి బాటలో పయణించగలదని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 130 సంవత్సరాల చరిత్ర గల మహా వృక్షం తమ పార్టీ అన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు దిక్కెవరూ లేరని విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి అందేలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నిరుపేద కూడా తన కాళ్లపై తాను నిలబడేలా జాతీయ ఉపాధి హామి పథకం ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పాలనదేనన్నారు. గత రెండేళ్లలోనే ప్రజల్లో మార్పు వచ్చిందని, తిరిగి కాంగ్రెస్ పూర్వ వైభవం సంతరించుకోనుందన్నారు. తిరుపతిలో వెంకటేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్ధానం చేసిన నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. జన్మభూమి కమిటీల పేరిట తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే లాభించేలా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. గ్రామగ్రామానికి వెళ్లి కాంగ్రెస్ చేసిన పథకాలు అమలు తీరు, అభివృద్ధి ఫలాలు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలలను కార్యకర్తలు విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుండుపై కారం చల్లేలా కాంగ్రెస్ వలనే విభజన చేసినట్లు పదే పదే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదాపై నోరు మెదపకుండా వ్యవహరించడం ఆయనకే చెల్లుతుందన్నారు. ఒకప్పుడు ప్యాకేజి అవసరమని, ప్రత్యేక హోదా ఇప్పుడు అవసరమని చెపుతుండటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. అనంతరం ఆమెను శాలువాలతో కప్పి పార్టీ కార్యకర్తలు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పనబాక కృష్ణయ్య, ఉదయగిరి ఇన్‌చార్జి చెంచలబాబుయాదవ్, మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, కిశోర్, బాలకృష్ణ, సుమన్, అమరనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.