శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వెంకటాచలం ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఆర్‌జెడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఆగస్టు 5 : వెంకటాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పి పార్వతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యాబోధన, రికార్డులు, మధ్యాహ్న భోజనం తదితర వాటిని ఆమె పరిశీలించారు. దీంతోపాటు పాఠశాలలో మొత్తం 16 మంది ఉపాధ్యాయులకు గాను ఆరుగురు సెలవులో ఉండటం, ఒకరు శిక్షణపై వెళ్లి ఉండటంపాటు 90 మంది విద్యార్థులు పాఠశాలకు రాకపోవడంతో ఆమె కొంత అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు నిబంధనల ప్రకారం 10 శాతానికి మించి సెలవులు పెట్టరాదని, అయితే ఆరుగురు సెలవులు పెడితే ఇక తరగతులు, విద్యాబోధన ఎలాగని ఆమె ప్రశ్నించారు. కొన్ని తరగతుల విద్యార్థులను పాఠశాల బయట వరండాలలో ఉంచి విద్యా బోధన చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు అత్యవసరం మినహాయిస్తే పది శాతానికి మించి ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వరాదన్నారు. పాఠశాలలకు హాజరుకాని విద్యార్థులు ముందు రోజే సెలవుచీటి ఆ తరగతి ఉపాధ్యాయుడికి ఇచ్చేలా విద్యార్థులకు నేర్పించాలన్నారు. లేకుంటే తోటి విద్యార్థులతో సెలవు చీటి ఉదయం పూట పంపించాలన్నారు. ఈ ప్రకియ తక్షణం అమలు చేయాలని ఆమె సూచించారు. విద్యార్థుల పూర్తి చిరునామా, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు నమోదు చేసుకుని పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ప్రధానోపాధ్యాయులు తప్పకుండా తరగతులను పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని కోరారు. ఉపాధ్యాయులు ముందస్తు ప్రణాళిక లేకుండా బోధిస్తున్నారని, ఇలకాకుండా పాఠ్యాశంపై ముందురోజే సిద్ధమై పిల్లలకు బోధించాలని కోరారు. అన్ని పాఠశాలల్లో వరండాలలో తరగతులు, విద్యాబోధన చేసే విధానానికి స్వస్తి చెప్పాలన్నారు. వరండాల్లో విద్యాబోధన చేయడం వల్ల విద్యార్థులకు పాఠ్యాశాలు అర్థం కావని, అదే తరగతి గదులలో చెప్తే పాఠ్యాంశాలు అర్థమవుతాయని ఆమె సూచించారు. మధ్యాహ్న భోజనం వండే విధానాన్ని ప్రధానోపాద్యాయులు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ఆమె వెంట మండల విద్యాశాఖ అధికారి కొండయ్య, పాఠశాల ప్రధానోపాద్యాయురాలు రాజేశ్వరి, ఎపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలకృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.