శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చెంగాళమ్మకు వైభవంగా పుష్పయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 5: చెంగాళమ్మ ఆలయంలో శ్రావణమాస తొలి శుక్రవారం కావడంతో అమ్మవారికి పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాల మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి వివిధ రకాల పుష్పాల తెచ్చి వైభవంగా యాగాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన నంబూరు మోహన్‌రావు. సులోచన ఉభయకర్తలుగా వ్యవహరించారు. వీరికి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అరవభూమి చంద్రశేఖర్‌రెడ్డి, ఇఓ శ్రీనివాసులరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి యాగం అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత వేనాటి రామచంద్రారెడ్డి, టిడిపి నేత ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా మున్సిపాలిటి కార్యాలయం వెనుకనున్న బాలాంజనేయ స్వామి ఆలయంలో మహాలక్ష్మి హోమాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి 108 తామర పుష్పాలు, 108 వివేష హోమ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా సాయినగర్‌లోని సాయిబాబ మందిరంలో ఆలయం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తవ్వడంతో మహాకుంబాభిషేక వేడుకులు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం గోపూజ, గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.