శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, ఆగస్టు 5: జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు వాటి వినియోగంపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడిఒలు, ఎపిఒలతో శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవం సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31కల్లా బహిరంగ మల విసర్జనరహిత జిల్లాగా చేసేందుకు అధికారులు తమ వంతు సహకారం అందించాలన్నారు. జిల్లా అనేక ఉద్యమాలకు నెలవై చైతన్యవంతమైన ప్రదేశమన్నారు. అలాంటి ఉద్యమస్ఫూర్తితో ఆత్మగౌరవం కార్యక్రమాన్ని కూడా చేపట్టాలన్నారు. మరుగుదొడ్ల సౌకర్యం లేకనే బాలికలు ఉన్నత చదువులకు డ్రాపవుట్స్ అవుతున్నారని అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీల్లో అవగాహన కోసం స్థానికంగా ఉన్న గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులను వినియోగించాలన్నారు. నిఘా కమిటీలు అందుబాటులో ఉండి సమీక్షించుకోవాలన్నారు. గ్రామాల్లో మహిళలు రాత్రి బస విషయంలో ఎలాంటి అపోహలకు తావివ్వరాదన్నారు. వాస్తవ పరిస్థితులు తెలియపరిస్తే వారికి మినహాయింపు ఇవ్వటంలో ఎలాంటి సంకోచం లేదన్నారు. జడ్పి సిఇఒ బి రామిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 9కల్లా ఆత్మగౌరవం కార్యక్రమం చేపట్టామన్నారు. రాత్రిబస చేసే విషయంలో తన ద్వారా ఎలాంటి సెలవులు మంజూరు చేయబడవని, ఆ వ్యవహారమంతా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆత్మగౌరవం జిల్లా సమన్వయకర్త ఎం సుస్మితారెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.