శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

హత్య కేసులో నలుగురు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 5: రేబాల పంచాయతీ పరిధిలో గల రాఘవ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్విన్నర్‌గా పనిచేస్తున్న జక్కల శ్రీను హత్యకేసులో నలుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సిఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం నిందితులను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 30న జక్కా శ్రీనుపై సాగర్, తబ్బీర్, దస్తగిరి, రమేష్ దాడి చేశారని, ఈ దాడిలో శ్రీనుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. నిందితుల అరెస్ట్‌లో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు మీరా బాషా, రమణ, మోహన్‌లను సిఐ అభినందించారు.