శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఈత రాకుంటే నీటిలో దిగవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్ 10: ఈత రాకుంటే నీటిలో దిగి ప్రమాదాల బారిన పడవద్దని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి సూచించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ గ్రామంలో గల పెన్నా నదిపై నిర్మించిన పాత బ్రిడ్జి వద్ద పెన్నార్ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 8 కిమీ ఈత పోటీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు వేసవితాపాన్ని తట్టుకోలేక సరదాగా ఈత కోసం జలాశయాల వద్దకు వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ దుస్సంఘటనలను నివారించి యువతలో అవగాహన కల్పించేందుకు ఈ పోటీని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఇంతటి మంచి కార్యాన్ని ప్రారంభించిన నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. పెన్నార్ స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచలయ్య మాట్లాడుతూ 8 కిమీ ఈత పోటీని భారతదేశంలో తొలిసారిగా ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ఈత పోటీ జొన్నవాడలో ప్రారంభమై పెన్నా నది పొర్లుకట్ట వరకు కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా నీటిలో దిగి ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే సదుద్దేశ్యంతో ఈ పోటీ ప్రారంభించామన్నారు. ఈ పోటీలలో సుమారు 50 మంది ఈతగాళ్లు పాల్గొన్నారు.