శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

46 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, ఏప్రిల్ 12: రాష్ట్రంలో సాలీనా 46 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయర్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో మంగళవారం మత్స్య సహకార సంఘం నిర్వహణపై అవగాహన సదస్సలో నాయర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వం చేపల చెరువు లీజును గరిష్టంగా మూడేళ్లకు పెంచిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములలో అడవి ప్రాంతం కాకుండా ఉండి అక్కడ ఉప్పునీరు ఉండే దానిలో పీతలు, పండుకప్ప వంటి చేపల రకాలను పెంచడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. వాటికి సంబంధించి మండల తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన కోరారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు. వారు తమ ఉత్పత్తులను నాణ్యత ఉండే విధంగా ఆధునిక ప్యాకింగ్ చేస్తే మంచి ధరకు అమ్ముడు పోతాయన్నారు. ప్యాకింగ్ విషయంపై త్వరలో కొచ్చిన్ నుంచి అనుభవం కలిగిన మత్స్యకారులను పిలిపించి జిల్లాలోని మత్స్యకారులకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. మాంసం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని, చేపలు ఒక్కటే ఆరోగ్యంవంతంగా ఉంటున్నాయన్నారు. రాష్టవ్య్రాప్తంగా పంచాయతీల్లో మైనర్ ఇరిగేషన్‌శాఖ ద్వారా 40 వేల చెరువులున్నాయని, వాటన్నిటిలో కూడా చేపలు పెంచడానికి తగుచర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో 150 కోట్ల చేపపిల్లలు అవసరమని, ప్రస్తుతం కైకలూరు నుంచి 14 కోట్ల పిల్లలను మాత్రమే సరఫరా చేరస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవసరమైన చేపపిల్లల ఉత్పత్తికోసం మత్స్యసంఘాలు ముందుకు రావాలన్నారు. చెరువుల్లోనే ఒక ప్రాంతంలో వాటి ఉత్పత్తికోసం ఇరిగేషన్‌శాఖ అనుమతులు మంజూరు చేసిందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మత్స్యశాఖ గ్రామాలకు రోడ్లు, లింకు రోడ్లు వేయడానికి అవకాశం ఉందన్నారు. చేపగుడ్లను ఉత్పత్తి చేయడానికి అవసరమైన బీడింగ్ టెక్నాలజీని మత్స్య సహకార సంఘ సభ్యులకు శిక్షణ ఇవ్వాలని అధికారులను కోరారు. మత్స్యసహకార సంఘాలు తప్పనిసరిగా సంఘానికి చెందిన లావాదేవీల రికార్డులను బాగా రాయాలన్నారు. అది ఉంటేనే సొసైటీలకు ఇచ్చే రుణాలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందుతాయన్నారు. జాయింట్ కలెక్టర్-2 రాజ్‌కుమార్ మాట్లాడుతూ వ్యవసాయం, ఉద్యానవన పంటలు, చేపల పెంపకం అత్యున్నత స్థాయిలో ఉన్నాయన్నారు. చేపల వృద్ధిరేటును గణనీయంగా పెంచడానికి మత్స్యశాఖ సహకార సంఘాలు కృషి చేయాలన్నారు. జిల్లాలో చేపల సాగుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. చేపల అభివృద్ధికోసం సొసైటీలు సమష్టిగా పనిచేసి ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. ఈసమావేశంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి రాజేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ మత్స్య సహకార సంఘాల అధ్యక్షులతోపాటు మత్స్యకారులు పాల్గొన్నారు.