శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వడ్డెరల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 19: వడ్డెరల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారిని అన్నివిధాల అభివృద్ధిపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ ఛైర్మెన్ దేవళ్ల మురళి అన్నారు. జిల్లా కేంద్రంలోని రహదారులు, భవనాలు అతిథిగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016-17 ఆర్థిక ఏడాదిలో వడ్డెర సంక్షేమానికి 73.5కోట్ల కేటాయించి అందులో యాభై శాతం రాయితీ కల్పించి రుణం అందజేస్తామన్నారు. గుర్తింపు కలిగిన అన్ని సొసైటీలకు ఆర్థిక సాయం ఇవ్వనున్నామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో 1585 వడ్డెర సంఘాలున్నాయని, అందులోని 23, 775 మంది సభ్యులకు రుణం అందించే లక్ష్యం కాగా లబ్ధిదారులందరికి 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వడ్డెరలు సంక్షేమానికి పెద్దపీట వేశారని అభినందించారు. వడ్డెరలను ఎస్‌టి జాబితాలో చేర్చేందుకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పుకొచ్చారు. రుణాలను అర్హులైన వారికి అందజేసేందుకు బిసి కార్పొరేషన్, రెవెన్యూ, సాగునీరు, ఆర్ అండ్ బి, మున్సిపల్, ఎంపిడివోలు భాగస్వాములై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమావేశంలో బిసి సంక్షేమాధికారి సంజీవరావు, ఆ కార్పొరేషన్ ఇడి వెంకటస్వామి, వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు, ప్రధానకార్యదర్శి సిహెచ్ ఏడుకొండలు, కోశాధికారి బెల్లంకొండ చిన్నయ్య, జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసులు, కార్పొరేషన్ డిప్యూటి కమిషనర్, రెవెన్యూ, ఇరిగేషన్, తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.