శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైతులు రాయితీలు పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 19: రైతులు సకాలంలో పంట రుణాలను పునరుద్ధరించుకుని రుణ రాయితీలు పొందాలని సిండికేట్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరసింహమూర్తి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వింటేజ్ హోటల్‌లో సోమవారం వ్యవసాయ శాఖ, బ్యాంకర్ల సమన్వయంతో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామంది రైతులు పంట రుణాన్ని రెన్యూవల్ చేసుకుంటే రుణ విముక్తి పథకానికి అర్హులు కారనే అపోహలో ఉన్నారని, ఇది పూర్తిగా అవాస్తమన్నారు. ఇప్పటికే రుణ విముక్తికై రెండు విడతల నగదు చెల్లించటం జరిగిందన్నారు. రైతులందరూ వ్యవసాయ రుణాలు రెన్యూవల్ చేసుకుని అదనపు రుణం పొంది వడ్డీ రాయితీ పొందవచ్చన్నారు. వ్యవసాయ జెడి హేమమహేశ్వరరావు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు రైతాంగానికి అక్టోబర్‌లోనే రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంట రుణాలు రీ షెడ్యూల్ చేసుకోవాలన్నారు. కౌలు రైతులు కూడా రుణానికి అర్హులేనని కల్టివేషన్ ధ్రువీకరణ పత్రం పొందిన రైతులు బ్యాంక్‌లను సంప్రదించాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది పంట రుణాలు 3637 కోట్ల రుణ లక్ష్యం కాగా ఇప్పటికే 1700 కోట్ల రైతు రుణాలు అందజేశామన్నారు. సమావేశంలో నాబార్డు ఎజిఎం రమేష్‌బాబు, ఎపిజిబి ప్రాంతీయ మేనేజర్ శివయ్య, సిండికేట్ బ్యాంక్ ఎజిఎం చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.