శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 19: పారిశుద్ధ్య చర్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని గ్రీవెన్స్‌హాలులో సోమవారం వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టాస్క్ఫోర్స్ అధికారులు తప్పనిసరిగా తమ పరిథిలో ఉన్న గ్రామాలను సందర్శించి అక్టోబర్ నుండే పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. రాబోవు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయని, నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం గతంలో తీసిన డేటా వివరాలను పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజారోగ్యానికి వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలను ప్రకటించి వారికి ముందస్తు నగదు చెల్లింపులు ఇవ్వాలన్నారు. అధికారులు పత్రికలలో వచ్చే ప్రతికూల కథనాలపై స్పందించటంతో పాటు వాటి వివరాలను తన కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. కాగా డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో వచ్చిన 18 సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించారు. అనంతరం ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి వాటి పరిష్కారాలకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రీవెన్స్ సమావేశంలో జెసి ఎఎండి ఇంతియాజ్, జెసి-2 సాల్మన్ రాజ్‌కుమార్, డిఆర్‌ఒ మార్కండేయులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.