శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

లైంగిక దాడి కేసులో ఆర్‌టిసి డ్రైవర్‌కు పదేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, సెప్టెంబర్ 19: మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో నిందితుడైన ఆర్‌టిసి డ్రైవర్ ఓరుపల్లి పోలయ్యకు పదేళ్లు జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధిస్తూ సోమవారం గూడూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఏడుకొండలు తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2012 ఫిబ్రవరి 3వ తేదీన పట్టణంలోని విఘ్నేశ్వరపురం కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులపై నిందితుడు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. పాఠశాలకు వెళుతున్న చిన్నారులకు సమీపంలో నివాసం ఉంటున్న పోలయ్య జామకాయలు ఇస్తానని ఆశ చూపి, వారిని తన ఇంటికి తీసుకెళ్లేవాడు. వీరికి సెల్‌ఫోన్ ద్వారా నీలిచిత్రాలు చూపి లైంగిక దాడులకు ఒడిగట్టాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. పిల్లలకు స్నానం చేస్తుండగా, వారి శరీరంపై ఉన్న గాయాలను తల్లి గుర్తించి ఆరాతీయగా లైంగిక దాడి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి సిఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.