శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కార్పొరేషన్‌పై మంత్రి దృష్టిపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, సెప్టెంబర్ 19: పురపాలక శాఖ మంత్రి నారాయణ విజయవాడకే పరిమితం కాకుండా నెల్లూరు కార్పొరేషన్‌పై కూడా దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టాలని నగర ఎమ్మెల్యే పి.అనీల్‌కుమార్‌యాదవ్ అన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి నారాయణ విజయవాడకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లను చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో రోజురోజుకు అవినీతి పెరిగిపోతోందన్నారు. నగరంలో పలు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక నానా అవస్థలు పడుతుంటే నగరంలో డివైడర్లు, బ్యూటిషియన్‌కు రూ.కోటి నిధులు మంజూరు చేయడం సిగ్గుచేటన్నారు. నగరంలో ప్రధానంగా తాగునీరు, మురుగుకాలువలు, దోమలు, రోడ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు నగరంలో అనేక మొక్కలను తాము నాటామని ప్రస్తుతం ప్రభుత్వం నీరు - చెట్టు అని పదేపదే ప్రచారం చేస్తోందన్నారు. అమృత్ అనే ఒక పేపర్‌కు నెలకు రూ.50వేలు జీతం ఇచ్చేందుకు సోమవారం జరిగిన స్టాండింగ్ కమిటీలో మేయర్ ఆమోద ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గత 30 సంవత్సరాల నుంచి అనేక పత్రికలలో సీనియర్ పాత్రికేయులుగా పనిచేస్తున్న వారికి కూడా నెలకు రూ.50వేలు ఇవ్వడం లేదని, ఈ పత్రికకు అంత జీతం ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.40 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్‌లలో అభివృద్ధి పనులు జరుగుతుంటే నెల్లూరు కార్పొరేషన్‌లో మాత్రం 9 నెలలైనా టెండర్లు పిలవకపోవడం అన్యాయమన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, కాని వైసిపి కార్పొరేట్లు ఉన్న ప్రాంతాల్లో నిధులు ఇవ్వకుండా నిలిపివేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెబుతారన్నారు. నెల్లూరు కార్పొరేషన్ తీరు ఇలానే ఉంటే కార్పొరేషన్‌పై మెరుపుదాడి చేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్, రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.