శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మున్సిపల్ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, సెప్టెంబర్ 19 : నగరంలోని నగరపాలక సంస్థ పాఠశాలలను పట్ట్భద్రుల ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులురెడ్డి సోమవారం పరిశీలించారు. పాఠశాలల స్థితిగతులను, ఉపాధ్యాయుల సమస్యలు, పిల్లల విద్యాప్రమాణాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర పాఠశాల ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను తెరచి జనరల్ ఫండ్‌లో ఉన్న మొత్తాన్ని సిఎస్‌ఎస్‌లో ఉన్న మొత్తాన్ని వారివారి వ్యక్తిగత పిఎఫ్ ఖాతాలను జమచేయవలసిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సిపిఎస్ విధానం రద్దు తదితర సమస్యలపై పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అందరం విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు. సిపిఎస్ విధానం రద్దును కోరుతూ వాయిదా తీర్మానాన్ని తానే ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నగర శాఖ గౌరవాధ్యక్షుడు ఎ.విజయకుమార్, అధ్యక్షులు ఎస్‌డి జాఫర్‌మొహిద్దీన్, యుటిఎఫ్ సీనియర్ కార్యకర్త ఎన్.మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.