శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 19: జిల్లాలో భారీ ఎర్రచందనం డంప్‌ను జిల్లా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విశాల్ గున్ని సోమవారం స్థానిక ఉమేష్ చంద్ర కానె్ఫరెన్స్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. సీతారామపురం మండలం చిన్నగంపల్లి గ్రామ శివార్లలో దాచి ఉంచిన 34 ఎర్రచందనం దుంగలను కావలి డిఎస్పీ రాఘవరావు పర్యవేక్షణలో ఉదయగిరి సిఐ నేతృత్వంలో సీతారామపురం, దుత్తలూరు ఎస్సైలు, కానిస్టేబుళ్లతో కూడిన బృందం గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ప్రకాశం జిల్లా సిఎస్ పురం మండలం చెన్నపనాయునిపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి కుమార్, తమ్మిశెట్టి ఏడుకొండలు, తమ్మిశెట్టి రామకృష్ణ, తమ్మిశెట్టి ఉదయకుమార్‌లను ఆదివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తరచూ సీతారామపురం పరిసర ప్రాంతాల్లోని అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను సిద్ధం చేస్తున్నారనే పక్కా సమాచారంతో అటవీ సెక్షన్ అధికారి షేక్ ఖాజా రసూల్‌తో కలిసి పోలీసులు దాడి చేసి వీరిని పట్టుకున్నారు. అనంతరం వీరు దాచి ఉంచిన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగల విలువ సుమారు రూ.38 లక్షలు ఉంటుందని, వీటితో పాటు ఓ మోటార్‌సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇంత భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలను, నిందితులను పట్టుకున్న కేసులో ప్రతిభ కనబర్చిన కావలి డిఎస్పీ రాఘవరావు, ఉదయగిరి సిఐ శ్రీనివాసరావు, ఉదయగిరి ఎస్సై వెంకటరెడ్డి, సీతారామపురం ఎస్సై జిలాని బాషాలతో పాటు అటవీ అధికారి ఖాజా రసూల్‌ను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ విలేఖరుల సమావేశంలో అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు, కావలి డిఎస్పీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.