శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అంతా ఏకపక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 19: నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీలో పొందుపరిచిన అన్ని అంశాలకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. గత స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్లు దాసరి రాజేష్, కినె్నర ప్రసాద్‌లు మేయర్‌పై ఏకదాటిగా మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో మాత్రం వారు అన్ని అంశాలకు జూ హుజూర్ అంటూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం గమనార్హం. పత్రిక పేరుతో దోపిడీకి రంగం సిద్ధం చేసిన అంశాన్ని కూడా సభ్యులు ఎటువంటి అభ్యంతరం తెలపకుండా ఆమోదించడం విశేషం. పత్రికా సంపాదకుడికి ఏకంగా నెలకు 50 వేల రూపాయల జీతం ఇచ్చేందుకు సభ్యులు ఆమోదించారు. అంతేకాకుండా ఆయనకు సహాయకులుగా పని చేసేందుకు నలుగురుని నియమించేందుకు అంగీకరించారు. వారికి ఒకొక్కరికి 18వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఆమోదించారు. ఈనేపథ్యంలో కార్పొరేషన్ పత్రిక పేరుతో నెలకు 3, 4 లక్షల రూపాయలను దోచుకునేందుకు రంగం సిద్ధం చేశారు. మేయర్‌గా అబ్దుల్ అజీజ్ ఎన్నికైనప్పటి నుంచి కార్పొరేషన్‌లో ఏమి జరుగుతుందో తోటి సభ్యులకు అర్థం కావడం లేదు. గతంలో మేయర్‌పై తిరగబడ్డ కార్పొరేటర్లు కూడా మిలాఖత్ కావడంతో కార్పొరేషన్‌లో అంతా ఏకపక్షంగా జరిగిపోతోందన్న విమర్శలు వినవస్తున్నాయి. కౌన్సిల్, స్టాండింగ్ కమిటీలో అంశాలు చివరి వరకు సభ్యులకు తెలియడం లేదన్న అపవాదు ఉంది. కార్పొరేషన్‌లో మేయర్ వన్‌మేన్ షో నడిపిస్తున్నా తోటి సభ్యులు నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. గతంలో మేయర్‌ను వ్యతిరేకించిన స్టాండింగ్ కమిటీ సభ్యులు రాజేష్, కినె్నర ప్రసాద్‌లు ప్రస్తుతం మేయర్‌కు జై అంటూ స్టాండింగ్ కమిటీలో అన్ని అంశాలకు ఆమోదం తెలపడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టాండింగ్ కమిటీలో పెట్టిన అంశాల్లో ఏ ఒక్కటీ కూడా చర్చించకుండా మ్యాచ్ ఫిక్సింగ్‌లా సమావేశాన్ని నిర్వహించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.