శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

28 టన్నుల పిడిఎస్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం (మనుబోలు), సెప్టెంబర్ 19: వెంకటాచలం మండల పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద సోమవారం వేకువజామున సుమారు రూ.6 లక్షల విలువచేసే 28 టన్నుల ప్రజాపంపిణీ బియ్యాన్ని విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు, ఆంధ్రాకు చెందిన పిడిఎస్ బియ్యాన్ని తడ నుండి నెల్లూరుకు అక్రమంగా లారీలో అదివారం రాత్రి అక్రమార్కులు తరలిస్తున్నారు. ఈవిషయంపై విజిలెన్సు అధికారులకు సమాచారం అందడంతో హుటాహుటిన ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో సోమవారం వేకువజామున లారీలో తరలిస్తున్న బియ్యాన్ని గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో విజిలెన్సు డిఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ లారీ డ్రైవర్‌ను విచారించగా భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి లోడు చేశారని, నెల్లూరుకు వెళ్లిన తర్వాత ఫోను చేస్తే అన్‌లోడు చేసే అడ్రసు వివరాలు తెలుపుతానని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే లారీ జమాల్ అనే వ్యక్తిదిగా తమకు సమాచారం ఉందన్నారు. గతన నెలలో కూడా ఈ లారీ నుండి బియ్యం అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకుని కేసులు నమోదు చేశామన్నారు. లారీ నిర్వాహకుడిపై కేసులు నమోదు చేసి బ్లాక్‌మార్కెట్టును అరికట్టేందుకు చర్యలు చేపతామని తెలిపారు. ఆయన వెంట విజిలెన్సు సిఐలు ఉప్పల సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఏవో ధనుంజయ్యరెడ్డి తదితరులు ఉన్నారు.