శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సాగరం సొసైటీ అభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతసాగరం, సెప్టెంబర్ 19: జిల్లాలో మొత్తం 79 సహకార సొసైటీలు ఉండగా, సూళ్లూరుపేట, నాయుడుపేట సంఘాలు ప్రథమ శ్రేణిలో నిలుస్తున్నాయని, వాటిలాగే అనంతసాగరం కూడా అభివృద్ధి చేస్తానని డిసిసిబి చైర్మన్ మెటుకూరు ధనుంజయరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక సొసైటీలో విలేఖర్లతో మాట్లాడుతూ సాగరం సహకార సంఘం తాను జిల్లా బ్యాంక్ చైర్మన్ పదవి చేపట్టేనాటికి అధ్వాన్నంగా ఉందన్నారు. దానిని ఇప్పుడు కొంతమేర బాగుపరిచినట్లు చెప్పారు. అనంతసాగరం సొసైటీలో రూ. 15లక్షల నుంచి ఏడుకోట్ల వరకు డిపాజిట్ల పెంపుదల చేసినట్లు తెలిపారు. సొసైటీలో 2.51 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. రైతులు రుణాలుగా పొందవచ్చన్నారు. రుణాలకై రైతులు ఒక్కో గ్రూప్‌గా నాలుగు నుంచి పది మంది వరకు ఏర్పడి రుణం పొందవచ్చన్నారు. అలా రుణం పొందిన వారికి 40వేల రూపాయల వరకు అందజేస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్కో సొసైటీ నుంచి నెలకు 20 నుంచి 30లక్షల రూపాయల వరకు ఆదాయం లభిస్తుందన్నారు. ఆ మొత్తాన్ని 50 లక్షల రూపాయల వరకు పెంచుతామన్నారు. సొసైటీలకు ఎస్‌బి ఖాతాల్లో డిపాజిట్ల కంటే ఎక్కువగా వడ్డీ లభిస్తుందన్నారు.
జిల్లా అంతటా గోదాములు నిర్మిస్తా
జిల్లాలో ఉండే రైతాంగం ప్రతిఒక్కరికీ ఉపయోగపడేలా జిల్లా మొత్తం అవసరమైన గోదాము నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు. సొసైటీల అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు త్వరలో 44 ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సాగరం సొసైటీ ఉపాధ్యక్షులు జనార్ధనరెడ్డి, రోశిరెడ్డి, లక్ష్మిరెడ్డి, సిఇఓ రాజారెడ్డి, ఉష, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.