శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కాపులకు ప్రభుత్వం చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి రూరల్, సెప్టెంబర్ 22: కాపులకు ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తోందని బిసి కార్పొరేషన్ ఇడి వెంకటస్వామి పేర్కొన్నారు. ఎంపిడిఓ కార్యాలయంలో కాపులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో వివిధ అంశాలను ఆయన వివరించారు. విద్యోన్నతి పథకం ద్వారా కాపులకు ప్రభుత్వం ఇస్తున్న చేయూతలో భాగంగా సివిల్ సర్వీసెస్, బ్యాంకు, తదితర కోర్సులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోందని, సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు ఈ శిక్షణ తోడ్పడి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. ఇందుకోసం తెల్లరేషన్ కార్డు కలిగి విద్యార్హత కలిగినవారికి అవకాశం కల్పించందన్నారు. ఈ శిక్షణ కాల వ్యవధిలో వారికి ప్రోత్సాహకంగా 8వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించి పూర్తి శిక్షణతో పాటు ధ్రువీకరణ పత్రం అందచేస్తారన్నారు. ఫీజులో 50శాతం రాయితీ కల్పించిందన్నారు. పోటీ పరీక్షలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధి పథకం ద్వారా శిక్షణ ఇచ్చి 80శాతం హాజరు కలిగి వుంటే అలాంటి వారికి నెలకు 5వేల రూపాయలు చెల్లించడంతో పాటు వసతి, భోజన సదుపాయం కల్పిస్తోందన్నారు. కాపు పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధిచేకూరే వెసులుబాటు కల్పించగా, దీంతో వారికి ప్రయోజనం చేకూరి వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. స్వయం ఉపాధి పథకం ద్వారా 3నుంచి 5 మంది గ్రూపు సభ్యులకు రుణ సదుపాయం కల్పించి పారిశ్రామికులుగా ఎదిగేందుకు అవకాశం కల్పించిందన్నారు. 5లక్షల నుంచి 8లక్షల రూపాయల పైబడి వరకు రుణం అందించి తోడ్పాటు నిస్తోందన్నారు. ఇందులో 10లక్షల బ్యాంక్ రుణం, లబ్ధిదారుల వాటా 5లక్షల రూపాయలు చెల్లిస్తారన్నారు. కాపు సామాజిక వర్గం నుంచి అర్హులైన వారికి ఈ పథకాలు వర్తించి 50శాతం కంటే గరిష్టంగా లక్ష రూపాయల వరకు పూర్తిస్థాయిలో సబ్సిడీగా అందిస్తుందని, మిగిలిన 50శాతం బ్యాంక్ రుణం పొందవచ్చని తెలిపారు. 21నుంచి 50 మధ్య వయస్సు కలిగిన వారు అర్హులుగా పరిగణించబడిందన్నారు. ఈ మొత్తాన్ని కలెక్టర్ మంజూరు చేస్తారని అన్నారు. ఈపథకాలపై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
‘కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి’
కాపుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడు బీద మస్తాన్‌రావు స్పష్టం చేశారు. కాపులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తోందన్నారు. ఇందులో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించిందన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు బిసిలు, కాపుల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా 5లక్షల రూపాయల నుంచి 25లక్షల రూపాయలకు పైబడి నిధులు మంజూరు చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. స్వయం ఉపాధి పథకం, నైపుణ్యాభివృద్ధి పథకం, విద్యోన్నతి పథకం ద్వారా లబ్ధిచేకూరే అవకాశాలు కల్పించిందన్నారు. 150 ఎకరాలు కేటాయించి బిసిలకు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో వారి విద్యాభివృద్ధి మెరుగుపడటమే కాక ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు. ఎన్నికల్లో 90శాతం మంది బిసిలు పార్టీకి మద్దతు తెలపగా వారి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. ప్రతిపక్షం యత్నాలు ఫలించకపోగా దిక్కుతోచని పరిస్థితుల్లో వున్నారన్నారు. కాపులను బిసిల్లో చేర్చే ప్రక్రియలో భాగంగా మంజునాథ్ కమిటీని నియమించినట్లు చెప్పారు. ఈసమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన కాపు సంఘాల నాయకులు, నిరుద్యోగ యువతీ, యువకులు, కావలి ఎంపిడిఓ జ్యోతి, బిసి కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.