శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

‘మరోసారి సిఎంఆర్ ధాన్యం దోపిడీకి రంగం సిద్ధం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు, సెప్టెంబర్ 22: సిఎంఆర్ ధాన్యం సేకరించిన మిల్లర్లు ఇంకా గత సీజన్‌కు సంబంధించి దాదాపు 25 వేల టన్నుల బియ్యం ప్రభుత్వానికి బకాయి ఉన్నా వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని కోవూరు నియోజకవర్గ లోక్‌సత్తా పార్టీ ఇన్‌చార్జ్ నెల్లూరు నరసయ్య పేర్కొన్నారు. కోవూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రైతులతో కలసి ఆయన మాట్లాడుతూ ఈనేపథ్యంలో మరోమారు నెల్లూరు, కడప జిల్లాల మిల్లర్లు తమదైన శైలిలో అధికారులను ప్రసన్నం చేసుకొని ఎటువంటి బ్యాంకు గ్యారెంటీలు లేకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం వారి మిల్లులకు తరలించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రైతులు ఆరుగాలం పండించి కష్టార్జితాన్ని మిల్లర్లు కుమ్మక్కై తేమ పేరుతో ధరలు తగ్గించి దోపిడీ చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ అనుమతి లేకుండా కడప మిల్లర్లు ధరలు తగ్గించి దోచుకుంటున్నారని విమర్శించారు. రైతులు అప్పులు తీర్చడానికి చేతికి వచ్చిందే చాలు అని వారి కష్టాన్ని మిల్లర్ల చేతుల్లో పెడుతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మిల్లర్లకు వంతపాడుతూ వారికి అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శించారు. గురువారం ధాన్యం కేంద్రాలను పరిశీలించడానికి విచ్చేసిన లోక్‌సత్తా పార్టీ నాయకులు, రైతులు పత్రికా విలేఖర్ల సమావేశంలో తమ ఆవేదనను వెలిబుచ్చారు. జిల్లా పాలనాధికారి వెంటనే స్పందించి ఈ దోపిడీపై తగు విచారణ జరిపి రైతులకు మద్దతు ధర ఇచ్చి కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ బాధ్యులు బాబ్జీ, కిషోర్, రసూల్, సుబ్బారెడ్డి, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.