శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రతపై పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 22: దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో గురువారం ఆయన దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతపై ముద్రించిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దోమలు, వ్యాధుల నివారణ పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటంతో పాటు వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల సహకారంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధులను నిర్మూలించాలన్నారు. డెంగీ లక్షణాలు గల చోట్ల దోమల మందును పిచికారి చేయాలన్నారు. వారానికి ఒకసారి పాగింగ్, పరిసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వాడన పనికిరాని వస్తువులలో నీటినిల్వలు ఉండకుండా చూడాలన్నారు. ఆరోగ్య శాఖ ముద్రించిన ఈ పుస్తకాన్ని ఆశావర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలకు అందజేసి పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెసి-2 సాల్మన్ రాజ్‌కుమార్, వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ వరసుందరం తదితరులు పాల్గొన్నారు.