శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

దత్తత గ్రామాల కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 22: జిల్లాలో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాల అమలులో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న తన ఛాంబర్‌లో ఆకర్షణీయ గ్రామాలు, వార్డుల కార్యక్రమాల అమలుపై గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిథులు దత్తత తీసుకున్న గ్రామాలలో ప్రభుత్వ పరంగా చేయవలసిన కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరుగుదొడ్లు నిర్మించి వాటిని పరిశుభ్రంగా వినియోగించేలా చూడాలన్నారు. దత్తత గ్రామాలపై దాతలు ప్రత్యేక శ్రద్ధ కనుపరచాలని సూచించారు. సమావేశంలో జడ్పి సిఇఒ బి రామిరెడ్డి, సిపిఒ పిబికె మూర్తి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.