శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

స్వర్ణాల చెరువును తనిఖీ చేసిన మంత్రి నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 22: బారాషాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో జరిగే ఘాట్ పనులను రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల నుండి కుల, మతాలకు అతీతంగా రొట్టెల పండుగకు దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అన్నారు. ఈ పండుగకు రాష్ట్ర గుర్తింపు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గోదావరి, కృష్ణ పుష్కరాలను ఎంతో శ్రద్ధగా చేశామన్నారు. ఇక్కడ కూడా అంతే శ్రద్ధతో పండుగ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాకు 60.37 కోట్లు స్వదేశ దర్శన్‌లో భాగంగా కేటాయించడం జరిగిందన్నారు. అందులో 2.62 కోట్లు స్వర్ణాల చెరువుకు కేటాయించినట్లు వెల్లడించారు. అయితే ఈ ఘాట్ నిర్మాణానికి 4.02 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. జిల్లాలో 11 టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.