శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బురాన్‌పూర్‌లో ఇల్లు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, సెప్టెంబర్ 22: మండల పరిధిలోని చెముడుగుంటకు చెందిన పామూరు కృష్ణారెడ్డి ఇంటిలోకి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గత కొద్ది నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు రవికుమార్ యాదవ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందుతుడిగా ఉన్న కృష్ణారెడ్డి పరారీలో ఉండగా అతని తల్లి, మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. రవికుమార్ యాదవ్ ఇంటిపక్కనే ఉన్న కృష్ణారెడ్డి ఇల్లు, అతని బాబాయి ఇంట్లో అప్పటి నుండి ఎవరూ లేరు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం కృష్ణారెడ్డి ఇంటిలోకి వెనుక వైపున వున్న తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి ఇంటిలో ఉన్న మంచాలు, బీరువాలు, డైనింగ్ టేబుల్, నాలుగు ఏసిలు, ఇతర ఫర్నిచర్, కిటికీలు, తలుపులు పూర్తిగా ధ్వంసం చేసి కొన్నింటిని కాల్చివేశారు. మార్బుల్స్, ఇంటి పైకప్పుకు వేసిన సీలింగ్‌ను ధ్వంసం చేశారు. బీరువాలను పగులగొట్టి అందులో ఉన్న విలువైన వస్తువులతోపాటు డాక్యుమెంట్లను అపహరించుకుపోయారు. వీటి విలువ తెలియలేదు. కాగా కృష్ణారెడ్డి బాబాయికి చెందిన ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని కృష్ణారెడ్డి బంధువులు నెల్లూరు రూరల్ సిఐ శ్రీనువాసులురెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయనతోపాటు వెంకటాచలం ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ స్వర్ణలత, రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లి ఆ ఇళ్లను పరిశీలించిన వారు నిర్ఘాంతపోయారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.