శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మార్కెట్‌లోకి నకిలీ మందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 22: వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, నకిలీ ఎరువులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో వ్యవసాయాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తుందని, నకిలీవి మార్కెట్‌లోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, నకిలీ ఎరువులు అమ్మితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యవసాయదారునికి ఇచ్చే ఇన్‌పుట్‌లో నాణ్యత చాలా ప్రధాన అంశమన్నారు. వాటిని ఎక్కువ రేట్లకు అమ్మకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారుల ప్రకారం జిల్లాలో అదనంగా 40 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నందున వాటిపై వ్యవసాయాధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు హేమమహేశ్వరరావు, మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.