శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అలరించిన అలకల దోపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టమూరు, సెప్టెంబర్ 22: మండలంలోని మల్లాం గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి అలకల తోపు భక్తులను ఎంతగానో అలరించింది. రాజు వేటకు వెళ్లే సమయంలో దొంగలు నగలు దోచుకెళ్లడం, దొర దొంగలను పట్టించే విధానాన్ని వేదపండితుల మంత్రాలు, ప్రత్యేక వేషధారణలతో నాటకీయ ఫక్కీలో దొర దొంగలను తరిమికొట్టడం కోలాహలంగా జరిగింది. అనంతరం వల్లీ అమ్మవారి పరిణయం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీకాళహస్తికి చెందిన లాస్య తరంగిణి నృత్యాలయం మాస్టర్ బాలాజీ వారిచే భరతనాట్యం ఆహూతులను అలరించింది. ఈ సందర్భంగా వినాయకునికి, శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చందనాలంకారం చేశారు. నాయుడుపేటకు చెందిన జాన్‌డీర్ కంపెనీ ఎండి మధుసూదనరెడ్డి ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు. అనంతరం హైదరాబాద్ బంజారాహిల్స్ మార్వెల్ గ్రూప్ అధినేత మల్లారెడ్డి రమేష్‌రెడ్డి, జ్యోతిరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా సినీ పాటకచ్చేరి నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.