శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వాలకు ప్రజలే గుణపాఠం చెబుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓజిలి, సెప్టెంబర్ 22: ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతా మోహన్ హెచ్చరించారు. మండల కేంద్రమైన ఓజిలిలో గురువారం చింతా మోహన్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా నేటికీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన దానికి భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు రాష్ట్రం అభివృద్ధి కోసం మన్నవరం దగ్గర ఆరువేల కోట్లతో భెల్ కర్మాగారానికి, , దుగరాజపట్నం వద్ద ఓడరేవు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. నేటికీ అవి కార్యరూపం దాల్చలేదన్నారు. విదేశీ పర్యటనలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాడి వెంకటయ్య, నాగయ్య, రాజయ్య, కృష్ణయ్య, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.