శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అందరి చూపు షార్ వైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 25: ఒకే రాకెట్ ద్వారా ఉపగ్రహాలను రెండు కక్ష్యలోకి ప్రవేశపెట్టనుండడంతో ప్రపంచ దేశాల చూపంతా షార్ వైపే ఉంది. ఇస్రో శాస్తవ్రేత్తలు షార్ కేంద్రం నుండి ప్రతి ప్రయోగంలో ఏదోఒక కొత్తదనంతో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. ఈసారి ఏకంగా ప్రపంచంలో ఏ దేశాలు చేపట్టని విధంగా ఒకే రాకెట్ ద్వారా రెండు వేర్వేరు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి-సి 35 వాహక నౌక ద్వారా రోదసీలో పంపేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇందుకు తన నమ్మినబంటు పిఎస్‌ఎల్‌వి వాహక నౌకనే ఎంచుకోవడం విశేషం. అంతేకాకుండా ఈ ప్రయోగం 2:15 గంటలపాటు రాకెట్ పయనించేలా రూపకల్పన చేయడంతో అందరి చూపు ప్రయోగం పైనే పడింది. ప్రయోగంతో షార్‌కు మన శాస్తవ్రేత్తలు, విదేశీ శాస్తవ్రేత్తలు చేరుకోడంతో సందడి వాతావరణం నెలకొంది. గతంలో మార్చి ఆర్బిటల్ మిషన్ మామ్ ఉపగ్రహ ప్రయోగం 40 నిమిషాలపాటు జరిగింది. దాని తర్వాత ఈ ప్రయోగం 2 గంటలు పైన పయనించే రాకెట్ ఇదే కావడంతో దీనిని విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇస్రో రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోట గుండెకాయలాంటిదనే చెప్పాలి. ఇక్కడ ప్రయోగించిన ప్రతి ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో కీర్తిప్రతిష్టలు ప్రపంచ దేశాలకు పాకాయి. ఇప్పటివరకు షార్ కేంద్రం నుండి 57 ప్రయోగాలు చేపట్టారు. ఇందులో 9 ప్రయోగాలు విఫలం చెందగా మిగిలిన ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయి. ఇందులో పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు 36 చేపట్టగా మొదటిది మినహా మిగిలినవన్ని వరుసగా విజయఢంకా మోగించాయి. జిఎస్‌ఎల్‌వి 10. ఎస్‌ఎల్‌వి 4, ఎఎస్‌ఎల్‌వి 4, ఎటివి, ఆర్‌ఎల్‌వి మరో పునర్వినియోగ ప్రయోగం ఒకటి చేపట్టారు. ఇంతకుముందు విదేశాలపై ఆధారపడే ఇస్రో అన్ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ఇతర దేశాలకు దీటుగా స్థానాన్ని సంపాదించుకొంది. ఇది 58వ ప్రయోగం కాగా పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో 37వ ప్రయోగం కావడం విశేషం.
నిఘా నీడలో షార్
రాకెట్ ప్రయోగం దృష్ట్యా షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సూళ్లూరుపేట నుండి శ్రీహరికోటకు వెళ్లే మార్గమధ్యంలో అటకానితిప్ప వద్ద సిఐఎస్‌ఎఫ్ చెక్‌పోస్టు ఏర్పాటుచేసి షార్‌కు వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా షార్ మొదట, రెండో గేటు వద్ద అదనపు బలగాలను రప్పించి క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపుతున్నారు. షార్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సైతం అప్రమత్తం చేశారు. ఎవరైన కొత్త వ్యక్తులు వస్తే వివరాలు సేకరించే పంపుతున్నారు. సముద్ర మార్గాన, షార్ చుట్టుపక్కల అడవుల్లో కోస్ట్‌గార్డ్సు, మెరైన్ సిబ్బందిచే జల్లెడ పట్టి గాలిస్తున్నారు.