జాతీయ వార్తలు

మా ఆదేశాలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: హైకోర్టు ప్రదాన న్యాయమూర్తుల, న్యాయమూర్తుల బదిలీలు నియామకాలపై కొలీజియం నిర్ణయాలను అమలు చేయడంలో జాప్యం పట్ల సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రంపై తీవ్రంగా మండిపడింది. దీనివల్ల న్యాయ వ్యవస్థ కుప్పకూలిపోతోందని సుప్రీంకోర్టు అంటూ, ఈ జాప్యాన్ని ఎంతమాత్రం సహించబోమని, ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడం కోసం జోక్యం చేసుకుంటామని హెచ్చరించింది. జడ్జీల నియామకాలు ఆలస్యం కావడం వల్ల అనేక కేసుల విచారణలు ఆగిపోతున్నాయని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం అంటూ , దీనిపై కేంద్రంనుంచి ఆదేశాలు తీసుకోవాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. దేశంలోని 24 హైకోర్టుల్లో 478 ఖాళీలను ఇంకా భర్తీ చేయాల్సి ఉందని, దాదాపు 39 లక్షల కేసులు అక్కడ పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసిన రోజునే సుప్రీంకోర్టు కేంద్రం తీరుపై మండిపడ్డం గమనార్హం. జడ్జీల నియామకానికి సంబంధించి మెమోరాండం ఆఫ్ ప్రొసీడింగ్స్ విషయంలో కేంద్రానికి, న్యాయ వ్యవస్థకు మధ్య విభేదాలున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దీని ఖరారులో జాప్యం కారణంగా జడ్జీల నియామకాలను ఆపడం సరికాదని బెంచ్ వ్యాఖ్యానించింది. హైకోర్టు జడ్జీల నియామకానికి సంబంధించి ఎనిమిది నెలల క్రితం తీసుకున్న నిర్ణయం ఇంకా అమలు కాకపోవడంపై న్యాయ వ్యవస్థగా తాము జోక్యం చేసుకోవలసి ఉంటుందని హెచ్చరించింది. ‘ఎందుకింత అపనమ్మకం? ప్రతిపాదనలు ఎక్కడ ఆగిపోతున్నాయి? కొలీజియం 75 మంది పేర్లను ప్రతిపాదించింది. అయినా ప్రభుత్వంనుంచి ఎలాంటి స్పందనా లేదు. చివరిక చీఫ్ జస్టిస్‌ల నియామకాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. న్యాయమూర్తుల బదిలీలు సైతం ఆగిపోతున్నాయి. ఈ ప్రతిష్టంభన మంచిది కాదు’ అని న్యాయమూర్తులు ఎఎం ఖన్వల్కర్, వై చంద్రచూడ్‌లు కూడా ఉన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎవరి పేరుకు సంబంధించయినా సమస్య ఉంటే చెప్పండి. ఆ ఫైలు వెనక్కి పంపండి’ అని బెంచ్ పేర్కొంది.
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఇటీవల తన హైదరాబాద్ సందర్శనను ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుతం ఉండాల్సిన దానిలో 40 శాతం మందితోనే పని చేస్తోందని, కేసుల పెండింగ్ గణనీయంగా పెరిగిపోతోందని అన్నారు. కాగా, తాను ఈ విషయాన్ని అత్యున్నత స్థాయి దృష్టికి తీసుకువెళతానని, వారి సమాధానం మీకు తెలియజేస్తానని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి చెప్తూ, అప్పటివరకు ఈ అంశంపై స్వాతంత్య్ర సమరయోధుడు అనిల్ కబోత్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఎలాంటి నోటీసు జారీ చేయవద్దని బెంచ్‌ని అభ్యర్థించారు.