సాహితి

వొకటే దారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరు గెలిచినా వొకటే
నోటో, కులం పోటో వోటేసినప్పుడు
వేలికొస మీది సిరాచుక్క నలుపు మొహంతో
మన ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నప్పుడు
దేశ గగనతలం మీద ఏ సూర్యుడు పొడిచినా
స్వాతంత్య్రపు వెలుగు మాత్రం ప్రసరించనప్పుడు
ఎవరు గెలిచినా వొకటే
నోటో, కులం పోటో, వోటేసినప్పుడు

వొక నిరక్షర దేశంలో, కక్షా కార్పణ్యాల శిబిరంలో
ఎవరినీ ప్రశ్నించను వీలులేనప్పుడు
గోడమీది రాతల వాగ్దానాల మూగస్వరాలు
వోటర్లను చూసి సగర్వంగా నవ్వుతున్నప్పుడు
మంత్రుల కుర్చీల కోసం వ్యాపార ద్వారం తెరిచినప్పుడు
ఎవరూ ఎవరి కోసమూ కాకుండా స్వార్థపు మూటకున్న
మూడు ముళ్లనూ వొడుపుగా విడదీస్తున్నప్పుడు
ఎవరు గెలిచినా వొకటే
నోటో, కులం పొటో వోటేసినప్పుడు.
రైతు నోట్లో పొలం మట్టి కొట్టి
రాబందులు నోటిముద్దలు తన్నుకుపోతున్నప్పుడు
రామరాజ్యం రాక్షస సామ్రాజ్యమై వర్థిల్లుతున్నప్పుడు
మేధావులు వౌనం వీడని మూగజీవులై పోతున్నప్పుడు
పొట్టకూటికి పిల్లాపాపలతో పల్లెజనమంతా
నగరాల నగారా మోగిస్తూ వలస బాట పట్టినప్పుడు
అడవుల్ని సైతం ఆర్థిక వనరులుగా మారుస్తూ తారుస్తున్నప్పుడు
గిరిజనుల గుండెల్లో పాలకులు
ఆరని మంటలు పెడుతున్నప్పుడు
యువతకు ప్రేమ గొడ్డళ్లు, బరిసెలు,
బాకులే తప్ప భవిత పట్టనప్పుడు
ఎవరు గెలిచినా వొకటే
నోటో, కులం పోటో వోటేసినప్పుడు

కార్మికులు, శ్రామికులు, రైతన్నలు కూలీలు పిడికిలి బిగించి
అక్రమార్కుల వికృత పరాక్రమాన్ని అడ్డగించినప్పుడే
పతితులు, దళితులు, బానిసలు, భావుకులు సముద్ర తరంగాలై
వొకరి వెనుక మరొకరుగా వొక్క తాటిపై సాగినప్పుడే
కులం పోటు, పచ్చనోటు సిగ్గిల్లుతాయి
స్వాతంత్య్రపు బావుటాను సగర్వంగా ఎగరేస్తాయి!

- ఈతకోట సుబ్బారావు, 94405 29785