Others

19న పఠాభి శతజయంతి ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో తెలుగు శాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యానాం, కవి సంధ్య సంయుక్త నిర్వహణలో ప్రముఖ అభ్యుదయ కవి పఠాభి శత జయంతి ఉత్సవం ఈ నెల 19న యానాంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ‘పఠాభి సాహిత్యం - ప్రాసంగికత’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నారు. డా.అత్తలూరి నరసింహారావు, డా.సీతారాం, అదృష్టదీపక్, వంశీకృష్ణ, డా.వాడ్రేవు వీరలక్ష్మీదేవి, డా.జోశ్యుల కృష్ణబాబు, దాట్ల దేవదానం రాజు, మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, డా.వరుగు భాస్కరరెడ్డి తదితరులు వివిధ అంశాలపై పత్రాలు సమర్పిస్తారు. పఠాభి పరిశోధకులు డా.శిఖామణి కీలక ప్రసంగం చేస్తారు.
కవిసంధ్య - పానుగంటి కవితల పోటీ
21 మార్చి 2018 అంతర్జాతీయ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని కవిత్వ పత్రిక ‘కవిసంధ్య పానుగంటి కవితల పోటీ’ని నిర్వహిస్తోంది. ఆధునికమైన భాష, అభివ్యక్తితోపాటు సామాజిక అంశాలపై రాసిన వచన కవితలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. మొదటి బహుమతి రూ.3,000, 2వ బహుమతి రూ.2,000, 3వ బహుమతి రూ.1000, అయిదు మంచి కవితలకు రూ.500 చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. ఒక ఎంట్రీకి ఒక కవిత మాత్రమే పంపాలి. కవి పేరు, చిరునామా హామీ పత్రం పైన మాత్రమే పేర్కొనాలి. కవితలను పోస్ట్/కొరియర్ ద్వారా పంపాలి. ఈ-మెయిల్, వాట్సప్ ద్వారా పంపిన కవితలు పరిశీలించబడవు. బహుమతి పొందని కవులకు కవిసంధ్య పత్రిక ఒక సం. (6 కాపీలు) పంపబడును. కవితలు పంపాల్సిన చివరి తేదీ: 20, ఫిబ్రవరి 2018. పంపాల్సిన చిరునామా: దాట్ల దేవదానం రాజు, జక్రియానగర్, యానాం -533 464, వివరాలకు: 9440105987.
‘కలల దారుల్లో’ ఆవిష్కరణ
15.2.2018 సాయంత్రం 6 గంటలకు తెలంగాణా సాహిత్య విభాగం ప్రచురించిన ‘కలల దారుల్లో’ కవితా సంకలనం ఆవిష్కరణ సభ రవీంద్రభారతిలో జరుగుతుంది. కాళోజీ అవార్డు గ్రహీత అమ్మంగి వేణుగోపాల్, నవ తెలంగాణ సంపాదకుడు గుడిపాటి, జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ కాంచనపల్లి, సాహిత్య అకాడెమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి, సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొంటారు. జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి సమావేశకర్తగా వ్యవహరిస్తారు.